PAN-Aadhaar linking deadline this month (Photo-PTI

దేశవ్యాప్తంగా కోట్లాది మంది పాన్ కార్డుదారులకు ఇది అత్యంత కీలకమైన హెచ్చరికను జారి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికీ మీ పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN)ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకుంటే నష్టపోతారని హెచ్చరించింది. వెంటనే అప్రమత్తం అవ్వాలని తెలిపింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) నిర్ణయించిన గడువు ఇప్పటికే ముగిసిపోయింది. గడువు లోపు లింక్ చేయని పాన్ కార్డులు ఇప్పుడు నిష్క్రియం (Inactive) అవుతున్నాయి. దీని వల్ల మీ ఆర్థిక లావాదేవీలు, పన్ను రిటర్నులు, బ్యాంకింగ్ సేవలు అన్నీ నిలిచిపోయే ప్రమాదం ఉంది.

ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139AA ప్రకారం ప్రతి పాన్ కార్డుదారు తమ పాన్‌ను ఆధార్‌తో తప్పనిసరిగా అనుసంధానం చేయాలి. ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే.. పన్ను ఎగవేతలను అరికట్టడం, ఒకే వ్యక్తి పేరుతో ఉన్న నకిలీ పాన్ కార్డులను తొలగించడం, పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం వంటివి ఉన్నాయి. ప్రభుత్వం అనేకసార్లు గడువు పొడిగించినప్పటికీ, ఇంకా లక్షలాది మంది పాన్ ఆధార్ లింక్ చేయకపోవడంతో ఇప్పుడు పాన్ కార్డు రద్దు ప్రక్రియ వేగవంతమవుతోంది. ఇకపై లింక్ చేయాలంటే తప్పనిసరిగా రూ. 1,000 జరిమానా చెల్లించాలి.

ఆ కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తకండి, డిజిటల్ అరెస్ట్ స్కాంలపై ఎన్పీసీఐ హెచ్చరిక, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని వెల్లడి

మీ పాన్ కార్డు నిష్క్రియం అయిన వెంటనే మీరు చట్టపరంగా పాన్ కార్డు లేని వ్యక్తిగా పరిగణించబడతారు. దానివల్ల కలిగే ప్రధాన సమస్యలు ఏంటంటే.. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయలేరు. రిఫండ్లు నిలిచిపోతాయి, ప్రభుత్వ ఖాతాలోనే ఉంటాయి. అధిక TDS (సాధారణంగా 20%) మీ జీతం, వడ్డీ, ఇతర ఆదాయాలపై కట్ అవుతుంది బ్యాంకింగ్ లావాదేవీలు కష్టతరంఅయి రూ.50,000 మించిన ట్రాన్సాక్షన్లు నిలిచిపోతాయి. డీమ్యాట్ ఖాతా తెరవలేరు. ఆస్తుల కొనుగోలు–అమ్మకాల ప్రక్రియలు నిలుస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే పాన్ రద్దయితే మీ మొత్తం ఆర్థిక వ్యవస్థ స్తంభించినట్టే.

ఇంకా సమయం పూర్తిగా అయిపోలేదు. రూ. 1,000 జరిమానా చెల్లించి మీ పాన్ కార్డును మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు.

1.incometax.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి లాగిన్ అవ్వండి.

2.‘e-Pay Tax’ ఆప్షన్‌లో Challan No./ITNS 280 ఎంచుకోండి.

3. Assessment Year 2024-25సెలెక్ట్ చేసి,‘Other Receipts (500)’ కింద రూ.1,000 ఫీజు చెల్లించండి.

4. చెల్లింపు తర్వాత 4-5 రోజుల తర్వాత, “Link Aadhaar” విభాగంలోకి వెళ్లి పాన్, ఆధార్ నంబర్లు నమోదు చేయండి.

5. లింక్ చేసిన తర్వాత, 30 రోజుల్లోపే మీ పాన్ యాక్టివ్ అవుతుంది.

ప్రభుత్వ నిబంధనలను లైట్‌గా తీసుకోవద్దు. వెంటనే మీ PAN-Aadhaar Linking Status ను చెక్ చేయండి. ఒకవేళ లింక్ చేయకపోతే, పై విధానం ద్వారా వెంటనే పూర్తి చేయండి. ఆలస్యం చేస్తే మీ ఆర్థిక భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.