New Dlehi, Oct 17: కోవిడ్ వ్యాక్సిన్ కోసం అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరోనా వ్యాక్సిన్ (COVID-19 Vaccine) బయటకు వస్తే కొన్ని లక్షల షార్క్ చేపలు కనుమరుగవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం షార్క్ చేపల కాలేయం నుంచి తీసే నూనెను (Shark liver oil) కరోనా వ్యాక్సిన్ తయారీలో ఉపయోగిస్తున్నారు. స్క్వాలిన్ పేరుతో (Squalene and COVID-19 vaccine) పిలవబడే ఈ నూనె రోగ నిరోధక శక్తి పెంచటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ కారణంతో దీని అవసరం ప్రస్తుతం అధికమైనట్లు కాలిఫోర్నియా కేంద్రంగా పని చేసే ఓ టీకా తయారీ సంస్థ అభిప్రాయపడింది. ఇప్పటికే ఈ స్వ్కాలిన్‌ను బ్రిటన్‌కు చెందిన ఫార్మాసూటికల్ కంపెనీ ఫ్లూ వ్యాక్సిన్‌ల తయారీలో వాడుతోంది. మూడు వేల పెద్ద షార్క్ చేపల నుంచి టన్ను స్క్వాలిన్ (Squalene) వస్తుంది. ఇలా ప్రపంచంలోని జనాభాకు దీన్ని ఉపయోగించి చేసిన టీకా ఇవ్వాలంటే అయిదు లక్షల షార్క్‌లు అవసరమవుతాయని నిపుణులు అంటున్నారు.
రెమెడిసివర్ ఔషధంపై డబ్ల్యూహెచ్‌ఓ షాకింగ్ వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే స్క్వాలిన్ అధికంగా ఉండే గుల్పర్ షార్క్, బాస్కింగ్ షార్క్ ప్రస్తుతం అంతరించే దశలో ఉన్నాయి. అయినా వాటి వేట కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం స్క్వాలిన్ కోసం 30 లక్షల షార్క్‌లను (Coronavirus Vaccine Could Kill Half Million Sharks) చంపుతున్నారు. ఈ లివర్ ఆయిల్‌ను కాస్మోటిక్స్, యంత్ర సంబంధ పరికరాల్లో సైతం వాడుతున్నారు. విషాదకరం ఏంటంటే ఇతర సమద్ర జీవుల్లా షార్క్‌లు పెద్ద సంఖ్యలో సంతానాన్ని ఉత్పత్తి చేయలేవు. ఈ నేపథ్యంలో స్క్వాలిన్‌కు ప్రత్యామ్నాయంగా పులియబెట్టిన చెరుకు గడ నుంచి తీసే పదార్థాన్ని వాడేందుకు శాస్ర్తవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు.
ఇప్పటికే చర్మసౌందర్య పరికరాలలో, కొన్ని రకాల మాయిశ్చరైజర్లలో షార్క్ లివర్ ఆయిల్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తయారీలో కూడా ఉత్తమ ఫలితాల కోసం షార్క్ లివర్ ఆయిల్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయడుతున్నారు. ఆశలు రేపుతున్న 10 వ్యాక్సిన్లు ఇవే
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 193 రకాల కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే వీటిలో ఐదు, ఆరు కంపెనీలు కరోనా వ్యాక్సిన్ తయారీలో షార్క్ ఆయిల్ ఉపయోగించాలని నిర్ణయించుకున్నాయి. ఇక బ్రిటన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను అందించడానికి 100 కోట్ల డోస్‌లు తయారుచేయాలని ప్లాన్ చేస్తోంది. ఇక ఒక్కొక్కరికి ఒక్కో డోస్ ఇచ్చిన ఇందుకోసం 25 లక్షల షార్క్‌లను చంపాల్సి ఉంటుంది.
ఆశలు ఆవిరవుతున్నాయా? జే అండ్ జే కరోనా వ్యాక్సిన్ పరీక్షలు నిలిపివేత
అదే ఒక్కొక్కరికి రెండు డోస్‌లు కావాల్సి వస్తే వీటి సంఖ్య రెట్టింపు అయ్యి 50 లక్షలకు పైనే ఉంటుంది. దీని గురించి షార్క్ పరిరక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే షార్క్‌ల మనుగడకే ముప్పు వాటిల్ల వచ్చని హెచ్చరిస్తున్నారు. అయితే షార్క్ అయిల్ బదులు షుగర్‌కేన్, గోధుమ, ఈస్ట్‌లు, బ్యాక్టీరియాలు వాడొచ్చని వారు సూచిస్తున్నారు. వీటిపై వ్యాక్సిన్ తయారీలో పాల్గొంటున్న నిపుణులు మాట్లాడుతూ, అన్ని రకాల వాటిని పరిశీలించిన తరువాతే షార్క్ ఆయిల్‌ను ఉపయోగిస్తామని, అంతకంటే వేరే దానితో చేస్తే వ్యాక్సిన్ మంచి ఫలితాలను ఇస్తుంటే వాటినే ఉపయోగిస్తామని పేర్కొన్నారు.
కరోనాపై మళ్లీ షాకింగ్ నిజాలు, మనుషుల చర్మంపై 9 గంటల దాకా బ్రతికే ఉంటుంది
ఈ నేపథ్యంలో జంతు ప్రేమికులు.. వ్యాక్సిన్ తయారీ కోసం షార్క్ చేపలను చంపొద్దంటూ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ పిటీషన్ change.org ద్వారా సంతకాలను సైతం సేకరిస్తున్నారు. దీనిపై షార్క్ అలియాస్ వ్యవస్థాపకురాలు స్టెఫానీ బ్రెండల్ మాట్లాడుతూ. ‘‘షార్క్‌లు చాలా అరుదైనవి. సాధారణ చేపల తరహాలో వాటి పెంపకం సాధ్యం కాదు. వాటి పునరోత్పత్తి కూడా చాలా ఆలస్యంగా ఉంటుంది.
ఏటా వ్యాక్సిన్ కోసం వాటిని చంపుకుంటూ పోతే.. భవిష్యత్తులో అవి కనుమరుగు అవుతాయి. మేం కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ఆపాలని అనుకోవడం లేదు. షార్కులకు బదులు ఇతర విధానాల్లో ‘స్క్వాలేన్’ సేకరణకు ప్రయత్నించాలని మాత్రమే కోరుతున్నాం’’ అని తెలిపారు.