Cyclone Gulab: ఏపీని తాకనున్న గులాబ్ సైక్లోన్, గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 670 కిమీ దూరంలో కేంద్రీకృతమైన తుఫాన్, రేపు కళింగపట్నం సరిహద్దులో తీరం దాటనున్న గులాబ్, దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
Cyclones In India | Representational Image | (Photo Credits: Wikimedia Commons)

New Delhi, September 25: ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) తుపాను హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 12 గంటల్లో తుపానుగా మారే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ తుపానుకు పాకిస్తాన్ సూచించిన ‘గులాబ్‌’గా (Cyclone Gulab) పేరుపెట్టారు. శని, ఆదివారాల్లో చురుగ్గా ఉంటుందని, సోమవారం బలహీనపడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. అల్పపీడనం.. గులాబ్ తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఈ వాయుగుండం గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 670 కిమీ, కళింగపట్నానికి 740 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఈ నెల 26 నాటికి కళింగపట్నం చుట్టుపక్కల దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రా సరిహద్దుల్లో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలో ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. గులాబ్ తుపాను కారణంగా బెంగాల్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మంగళవారం నుంచి కోల్‌కతాలోని హౌరా, దక్షిణ, ఉత్తర 24 పరగణాల జిల్లాతో పాటు తూర్పు మిడ్నాపూర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణలో మూడు రోజల పాటు భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం, తీవ్ర వాయుగుండంగా మారిన అల్ప పీడనం

తుపానును ఎదుర్కొనేందుకు కోల్‌కతా పోలీసులు ‘యూనిఫైడ్ కమాండ్ సెంటర్’ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. అన్ని పోలీస్ స్టేషన్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మరో వైపు తీర ప్రాంతాల్లో తుపానును ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. తుఫాన్‌ ప్రభావం వల్ల శని, ఆదివారాల్లో తీరం వెంబడి గంటకు 60 నుంచి 790 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కి.మీ, సోమవారం 70 నుంచి 80 కి.మీ, గరిష్టంగా 90 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు సూచించారు.

ఏపీకి తుఫాను ముప్పు, రేపటికి తీవ్ర వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, కోస్తా తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వేగంతో గాలులు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరికలు

ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో మాత్రం శనివారం సాయంత్రం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకూ గంటకు 90 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీయనున్నట్టు తెలిపింది. రాగల 12 గంటల్లో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, సోమవారం వరకూ ఈ పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ వెల్లడించింది. ఈ గులాబ్ తుఫాను పాకిస్తాన్ (The Name Given by Pakistan,) పెట్టిన పేరు వాస్తవానికి 'Gul-Aab'. దీనర్థం శాశ్వతంగా పువ్వులను పూసే గులాబీ మొక్క.

ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. గులాబ్ తుపాను కారణంగా బెంగాల్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మంగళవారం నుంచి కోల్‌కతాలోని హౌరా, దక్షిణ, ఉత్తర 24 పరగణాల జిల్లాతో పాటు తూర్పు మిడ్నాపూర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుపానును ఎదుర్కొనేందుకు కోల్‌కతా పోలీసులు ‘యూనిఫైడ్ కమాండ్ సెంటర్’ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. అన్ని పోలీస్ స్టేషన్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మరో వైపు తీర ప్రాంతాల్లో తుపానును ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు సైతం చేస్తున్నారు.