Newdelhi, May 28: రద్దీ (Crowd) ఎక్కువగా ఉన్న చోట ఎవరు ఏం మాట్లాడుతున్నారో స్పష్టంగా వినిపించదు. అయితే, వందల మంది ఒకేసారి మాట్లాడుతున్నప్పటికీ.. మనం ఏం వినాలనుకొంటున్నామో.. అదే వినేలా సాయపడే అధునాతన ఏఐ హెడ్ ఫోన్ (AI Headphone) ను యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు తీసుకొచ్చారు. ఈ హెడ్ ఫోన్ ను ధరించి మనం ఎవరి మాటలనైతే వినాలనుకొంటున్నామో.. ఆ వ్యక్తి వైపునకు చూస్తూ.. అతను మాట్లాడేప్పుడు హెడ్ ఫోన్ మీద ఉన్న బటన్ ను నొక్కాలి.
This AI headphone can listen to a single person in the crowd if you look at them https://t.co/6Ef3tfCa4F
— audai (@audaiuk) May 27, 2024
మెషిన్ లర్నింగ్ సాఫ్ట్ వేర్ తో..
అప్పుడు ఆ వ్యక్తి స్వరపేటిక శబ్ధాల పౌనఃపున్యాన్ని కంప్యూటర్ లోని మెషిన్ లర్నింగ్ సాఫ్ట్ వేర్ విశ్లేషించి.. ఆ వాయిస్ ను మాత్రమే హెడ్ ఫోన్ కు పంపిస్తుంది. అలా మనం ఎవరి మాటలను వినాలనుకుంటే, ఆ మాటలనే వింటాం.