Wipro Non-Compete Clause: విప్రోలో మానేసే ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న నాన్-కాంపిటేట్ నిబంధన, ఉద్యోగం మానేస్తే ఏడాది పాటు ఆ టాప్ 10 కంపెనీల్లో చేరడానికి వీల్లేదు మరి
విప్రో యొక్క నాన్-కాంపిటేట్ నిబంధన (Wipro Non-Compete Clause) గురించి ఎవరికైనా తెలుసా... ఈ నిబంధన కింద విప్రోని వదిలేసిన ఉద్యోగులు 12 నెలల పాటు టాప్ టెన్ కంపెనీల్లో ఉద్యోగంలో చేరలేరు. కంపెనీల్లో కీలకంగా వ్యవహరించే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రత్యర్థి కంపెనీల్లోకి జంప్ అవుతుండటంతో విప్రో ఈ కఠిన నిబంధన అమలు చేస్తోంది
విప్రో యొక్క నాన్-కాంపిటేట్ నిబంధన (Wipro Non-Compete Clause) గురించి ఎవరికైనా తెలుసా... ఈ నిబంధన కింద విప్రోని వదిలేసిన ఉద్యోగులు 12 నెలల పాటు టాప్ టెన్ కంపెనీల్లో ఉద్యోగంలో చేరలేరు. కంపెనీల్లో కీలకంగా వ్యవహరించే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రత్యర్థి కంపెనీల్లోకి జంప్ అవుతుండటంతో విప్రో ఈ కఠిన నిబంధన అమలు చేస్తోంది. ఈ నిబంధన కంపెనీ మారిన ఉన్నత ఉద్యోగులకు చుక్కలు (Executives cannot join Cognizant, 9 other rival firms) చూపిస్తోంది.
ఈ నిబంధన ప్రకారం.. విప్రో నుంచి వైదొలిగే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీలో వారి చివరి రోజు నుంచి ఒక సంవత్సరం పాటు 10 ప్రత్యర్థి సంస్థలలో ఉద్యోగంలో చేరలేరు.విప్రోలో జాయిన్ అయ్యే సమయంలో వీరికి కాంట్రాక్ట్‌లోని నాన్-కాంపిటేట్ నిబంధనపై సంతకం చేయించుకోవడమే కారణం. ఈ నిబంధన ఆధారంగా ప్రత్యర్థి కంపెనీ కాగ్నిజెంట్‌లో చేరిన తమ మాజీ సీఎఫ్‌వో జతిన్ దలాల్‌ను విప్రో ముప్పుతిప్పలు పెడుతోంది. నిబంధన ఉల్లంఘించి ప్రత్యర్థి కంపెనీలో చేరినందుకు గానూ నష్టపరిహారం కింద వడ్డీతో సహా రూ. 25.15 కోట్లు కట్టాలని కోర్టులో దావా వేసింది.
విప్రో ఎగ్జిక్యూటివ్‌ల కాంట్రాక్ట్‌లో పది ప్రత్యర్థి కంపెనీల పేర్లను పేర్కొంది. నాన్-కాంపిటేట్ నిబంధన కింద వారు విప్రోలో మానేసిన తర్వాత సంవత్సరం పాటు ఈ కంపెనీలలో చేరేందుకు వీలు లేదు. ఆ కంపెనీలు ఏంటంటే.. యాక్సెంచర్, క్యాప్‌జెమినీ, కాగ్నిజెంట్, డెలాయిట్, డీఎక్స్‌సీ టెక్నాలజీ, హెచ్‌సీఎల్, ఐబీఎం, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా.
(The above story first appeared on LatestLY on Jan 08, 2024 05:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

