
Newyork, Feb 22: అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఐ (FBI) నూతన డైరెక్టర్ గా భారతీయ అమెరికన్ కాష్ పటేల్ (Kash Patel) ప్రమాణ స్వీకారం చేశారు. భగవద్గీతపై (Bhagavad Gita) ప్రమాణం చేసిన ఆయన తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానంటూ చెప్పారు. వైట్ హౌస్ ఆవరణలో ఉన్న ఐసన్ హావర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భవనంలోని ఇండియన్ ట్రీటీ రూమ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పటేల్ స్నేహితురాలు, ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీ ఆయనతో ప్రమాణం చేయించారు. కాష్ పటేల్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తారు. కాష్ కఠినమైన, బలమైన వ్యక్తి అని ప్రశంసించారు.
Here's Video:
Kash Patel became the FBI Director & took his oath on the Bhagavad Gita
This was possible in USA because of Secularism & Constitution
The same thing which Sanghi BJPigs h@te in India & want to dismantle it 🤡
— Veena Jain (@DrJain21) February 22, 2025
కాష్ పటేల్ ఎవరు?
కాష్ పటేల్ లో అమెరికాలోని న్యూయార్క్ సిటీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన తల్లిదండ్రులు ఇండియాలోని గుజరాత్ కు చెందిన వారు. కాష్ రిచ్మండ్ యూనివర్సిటీ నుంచి హిస్టర్, క్రిమినల్ జస్టిస్ లో డిగ్రీ పొందారు. అలాగే పేస్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జేడీ కూడా పొందారు. గతంలో అమెరికా ప్రెసిడెంట్ కు డిప్యూటీ అసిస్టెంట్ గా, ఎన్‌ఎస్‌సీ (నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్)లో ఉగ్రవాద నిరోధన విభాగానికి సీనియర్ డైరెక్టర్ గా పనిచేశారు. ఎఫ్‌బీఐ తొమ్మిదవ డైరెక్టర్ గా కాష్ పటేల్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి అమెరికన్ సెనేట్ గురువారం ఆమోదించింది. పటేల్ నియామకానికి అనుకూలంగా 51, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి.
ఫ్రీగా చికెన్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్, హైదరాబాద్ ఉప్పల్‌లో ఎగబడ్డ జనం, గంటలోనే 2500 గుడ్లు ఖతం