Newdelhi, Dec 7: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో (Syria) పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. అధ్యక్షుడు బషర్-అల్-అసద్ గద్దె దిగాలంటూ తిరుగుబాటుదారులు భీకర దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో సిరియాలో సంక్షోభం తారాస్థాయికి చేరింది. పౌరుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో సిరియాలో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం అర్థరాత్రి కీలక సూచనలు (Travel Advisory) చేసింది. అక్కడ ఉన్నవారంతా వెంటనే స్వదేశానికి వచ్చేయాలని సూచించింది. ఒకవేళ రాలేనివారు డమాస్కస్ లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు చేయాలని తెలిపింది.
Travel advisory for Syria:https://t.co/bOnSP3tS03 pic.twitter.com/zg1AH7n6RB
— Randhir Jaiswal (@MEAIndia) December 6, 2024
ఈ నంబర్ సంప్రదించండి
సిరియాలోని ఇండియన్ సిటిజెన్స్ భద్రత గురించి జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అత్యవసర సహాయం కోసం +963993385973, hoc.damascus@mea.gov.inను సంప్రదించాలని పేర్కొన్నది. అదేవిధంగా ప్రభుత్వ తదుపరి నోటిఫికేషన్ జారీచేసే వరకు భారత పౌరులెవరూ సిరియా వెళ్లొద్దని ఆదేశాలు జారీచేసింది.