Donald Trump (Photo-X)

Newyork, Jan 21: అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి అధిష్ఠించిన డొనాల్డ్ ట్రంప్ (Trump 2.0 Begins) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి తగినట్టుగానే జన్మతః పౌరసత్వంపై వేటు వేశారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు జన్మిస్తే స్వతహాగా లభించే పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో జన్మించే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో 1868 నుంచే ఈ చట్టం అమల్లో ఉంది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకు, స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి కూడా జన్మతః పౌరసత్వం లభిస్తోంది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో జన్మతః పౌరసత్వం ఇక లేనట్టే.

నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఎనిమిదిచోట్ల ఏకకాలంలో 55 బృందాలతో దాడులు

ట్రంప్ పొరపాటు ప్రకటన

అమెరికా మాత్రమే కాదు.. దాదాపు 30 దేశాలు తమ దేశంలో జన్మించిన వారికి జన్మతః పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. అయితే, ట్రంప్ మాత్రం తమ దేశంలో మాత్రమే ఇలాంటి చట్టం అమల్లో ఉన్నట్టు పొరపాటుగా పేర్కొనడం గమనార్హం.

భైరవద్వీపం మూవీ విలన్ విజయ్ రంగరాజు కన్నుమూత, గుండెపోటుకు గురై మృతి చెందిన గోపీచంద్ మూవీ యజ్ఞం నటుడు

ఇంకా వీటిపై కూడా..

పారిస్ వాతావరణ ఒప్పందం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం మేర సుంకాలు విధిస్తున్నట్టు వెల్లడించారు. హెచ్ 1బీ వీసాలపై (H1B Visas) ఇంకా నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.