Amaravati, April 11: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో హోం క్వారంటైన్‌లోకి (Pawan Kalyan Home Quarantine) వెళ్లారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వర్చువల్ పద్ధతిలోనే జనసేన పార్టీ కార్యకలాపాలను పవన్ కల్యాణ్ పర్యవేక్షిస్తున్నారు.
త్వరలోనే తిరుపతి ఉప ఎన్నికల జరగనున్న విషయం తెలిసిందే. ఆ స్థానంలో పోటీకి బీజేపీ-జనసేన తరఫున అభ్యర్థిగా రత్నప్రభ పోటీ చేస్తున్నారు. ఎన్నికముందే పవన్ కల్యాణ్ సిబ్బందిలో కొందరు కరోనా బారిన పడడంతో పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటనలపై సందిగ్ధత నెలకొంది. ఆయన కరోనా పరీక్షలు చేయించుకుని నెగటివ్ అని తేలితే మళ్లీ ప్రత్యక్షంగా ఎన్నిక ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే తిరుపతి ప్రచారంలో కరోనా కలకలం సృష్టించింది. ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి (Addanki MLA Gottipati Ravi), మాజీ మంత్రి జవహర్ (Former Minister Jawahar), టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యారాణిలకు కరోనా పాజిటివ్‌గా (TDP MLAs and former MLAs tests positive for covid 19) తేలింది.
దీంతో టీడీపీ నేతలు ప్రచారం నుండి నేరుగా హైదరాబాద్ (Hyderabad) బయలుదేరారు. చంద్రబాబుతో కలిసి అనిత, సంధ్యారాణి తిరుమల దర్శనానికి వెళ్లిన ఆ మరుసటి రోజునే ఇద్దరికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కరోనా భయంతో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆందోళన చెందుతున్నారు.
ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభ రద్దు అయ్యింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు రాలేకపోతున్నానని సీఎం (AP CM YS Jagan) పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రజలకు సీఎం వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాశారు.
తిరుపతి సభకు (tirupati-election-campaign) నేను హజరైతే వేలాదిగా జనం తరలివస్తారు. ప్రజల ఆరోగ్యం, ఆనందం నాకు ముఖ్యం. బాధ్యత కలిగిన సీఎంగా తిరుపతి సభ రద్దు చేసుకుంటున్నా. ప్రతి కుటుంబానికి కలిగిన లబ్ధికి సంబంధించిన వివరాలతో.. నా సంతకంతో ఇంటింటికి అందేలా ఉత్తరం రాశానని తెలిపారు.