Low pressure (Photo Credits: PTI)

Amaravati, Dec 15: దక్షిణ అండమాన్‌ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారం మధ్యాహ్నం అల్పపీడనం (Low pressure area) ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా పయనిస్తూ గురువారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారనుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అదే తీవ్రతతో అదే దిశగా పయనిస్తూ 17వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది.

మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆపై మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. కాగా బుధవారం తూర్పు గోదావరి జిల్లా పోతవరంలో 4.1, అల్లూరి సీతారామరాజు జిల్లా కుంతలంలో 2.5 సెం.మీల వర్షపాతం నమోదైంది.

మళ్లీ దూసుకొస్తున్న తుపాన్, రెండు మూడు రోజుల్లో మోగా విరుచుకుపడే అవకాశం, రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

ఏపీలో నిన్న కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడులో అత్యధికంగా 92.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతి, విశాఖపట్టణం, బాపట్ల సహా పలు జిల్లాల్లో నిన్న వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు భయపెట్టాయి. తుపాను కారణంగా పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లోని పంటలు ధ్వంసమయ్యాయి.

వీడియో ఇదే.. ఉయ్యూరులో పోలీసుల బెదిరింపులు, వ్యభిచార గృహంలో కూర్చుని పేకాడుతూ.. దుస్తులు మార్చుకొని వస్తారా, లేక ఇలానే కొట్టుకుంటూ తీసుకెళ్లలా అంటూ ఓవర్ యాక్షన్

మరోవైపు, రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయి చలి తీవ్రత పెరుగుతుందని హెచ్చరిక జారీ చేసింది.