TS-AP Water Dispute: మలుపులు తిరుగుతున్న నీటి వివాదం, రాయలసీమకు గోదావరి మిగులు జలాలు తీసుకుపొమ్మన్న కేసీఆర్, మా నీళ్లను మేము వాడుకుంటామని స్పష్టం చేసిన ఏపీ సర్కారు
File Images of AP CM Jagan & TS CM KCR.

Hyderabad,May 19: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని పెంచడం కోసం ఏపీ సర్కారు (AP Govt) జీవో జారీ చేయడం.. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి (TS-AP Water Dispute) దారి తీసిన సంగతి తెలిసిందే. జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కేసీఆర్ సర్కారు ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రం పాలయ్యే గోదావరి నీళ్లు సీమకు తరలించడంలో తప్పేం లేదని, రాయలసీమకు (Rayalaseema) నీళ్లు ఎందుకు పోవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. తెలిసీ తెలియక మాట్లాడేవారి గురించి తాను పట్టించుకోనన్నారు. మా నీళ్లను మేము తీసుకుంటున్నాం, దీనిపై రాజకీయాలు చేయడం తగదు, కృష్ణా జ‌లాల అంశంపై స్పందించిన ఏపీ సీఎం వైయస్ జగన్

నీటి వాటాలకు సంబంధించి తనకు స్పష్టమైన అవగాహన ఉందని పేర్కొన్నారు. అందరికి మంచి జరగాలన్నదే మా ఆశ. ప్రజల అవసరాల కోసం నీళ్లు తీసుకోవటంలో తప్పులేదు. బేసిన్‌లు లేవు.. భేషజాలు లేవు. చంద్రబాబు బాబ్లీ బోగస్‌ పంచాయితీతో ఏం వచ్చింది?. దాని వల్ల ఒక్క టీఎంసీ కూడా సాధించలేదు. ఘర్షణ వాతావరణం ఏ రాష్ట్రానికి అవసరం లేదు. మాకు రెండు నాల్కలు లేవు. గోదావరిలో మిగులు జలాలు ఎవరు వాడుకున్నా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు VS పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు

ఇదిలా ఉంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు (Pothireddypadu Reservoir) విషయంలో తాము వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నామని.. ముందుగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రద్దు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం తెలంగాణ ముందు ప్రతిపాదన ఉంచినట్లు సమాచారం. పాలమూరు ప్రాజెక్టుకు 2015లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో పది లక్షరాలకుపైగా ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించాలని భావించారు. మొదట జూరాల నుంచి నీటిని ఎత్తిపోయాలని భావించగా.. తర్వాత దాన్ని శ్రీశైలానికి అనుసంధానం చేశారు.

బండి సంజయ్ లేఖ : స్పందించిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌

ఈ పరిస్థితులు ఇలా ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంపున కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో జారీ చేసిందని, శ్రీశైలం నుంచి నీటిని తరలించేందుకు ఇతర ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, దీనిని కేంద్రం అడ్డుకోవాలంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఇటీవల రాసిన లేఖపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పందించారు. సదరు లేఖ అందిందని, దాన్ని తమ శాఖ పరిశీలిస్తోందని పేర్కొంటూ శనివారం బండి సంజయ్‌కి కేంద్ర మంత్రి లేఖ రాశారు.  ఏపీ సీఎం జగన్ చర్యపై టీఎస్ సీఎం కేసీఆర్ ఆగ్రహం, ఎత్తిపోతల పథకంపై ఏపీ నిర్ణయం తీవ్ర అభ్యంతరకరం అని వ్యాఖ్య, వెంటనే కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయాలని అధికారులకు ఆదేశం

వెంటనే సమావేశం ఏర్పాటుచేయాలని, ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లను సాంకేతికంగా పరిశీలించాలని కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ)ను ఆదేశించినట్టు ఆ లేఖలో షెకావత్‌ పేర్కొన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014లో పేర్కొన్న కృష్ణా నదీ జలాల నిర్వహణ నియమాలకు అనుగుణంగా ఉన్నాయా అనేది తేలే వరకు ఈ ప్రాజెక్టుల విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌కు చెప్పాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. అలాగే, కృష్ణానది నీటి వినియోగానికి సంబంధించి రెండు రాష్ట్రాల చర్యలపై చర్చించేందుకు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేయాలని తమ శాఖ అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు.

కేఆర్‌ఎంబీకు ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది ?

శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచి నీటిని తరలించి తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన జలాలను మాత్రమే ఈ ఎత్తిపోతల ద్వారా తరలిస్తామని, దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం విఘాతం కలగదని తేల్చి చెప్పింది. తెలంగాణ కలల ప్రాజెక్ట్ కాళేశ్వరం నేటితో సాకారం. ఎన్నో వింతలు, విశేషాలు మరెన్నో అద్భుతాలు కలిగి ఉన్న ప్రాజెక్టుపై ఓ వివరణాత్మక కథనం.

2016 సెప్టెంబరు 21న ఢిల్లీలో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తమకు కేటాయించిన నీటిని వినియోగించుకోవడానికే పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టామని తెలంగాణ సర్కార్‌ చెప్పిన విషయాన్ని కృష్ణా బోర్డుకు గుర్తు చేస్తూ రాయలసీమ ఎత్తిపోతలనూ అదే తరహాలో చేపట్టామని స్పష్టం చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌తో రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి సమావేశమయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు ఈ ప్రాజెక్టుల దెబ్బ తగులుతోంది

గోదావరిపై శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు దిగువన, పోలవరం ఎగువన అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్‌ చేపట్టిన ప్రాజెక్టులు నదీ పరీవాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బ తీస్తాయని, వాటిని తక్షణమే నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గోదావరి బోర్డు(జీఆర్‌ఎంబీ)కి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఏపీలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందని, గోదావరి డెల్టాకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర జలసంఘం, గోదావరి బోర్డు, జల్‌శక్తి శాఖ, కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు ఫిర్యాదు చేశామని, మరోసారి ఈ అంశాన్ని బోర్డు దృష్టికి తెస్తున్నామని పేర్కొంది. కాళేశ్వరం పర్యటనలో సీఎం కేసీఆర్, త్రివేణి సంగమం వద్ద, ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, తుపాకులగూడెం బరాజ్‌కు సమ్మక్క బరాజ్‌గా పేరు మార్పు

సోమవారం హైదరాబాద్‌లోని జల్‌సౌధలో గోదావరి బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌తో రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి సమావేశమయ్యారు. గోదావరి నుంచి 450.31 టీఎంసీలను తరలించేలా తెలంగాణ ప్రభుత్వం పనులు చేపట్టిందని బోర్డుకు అధికారులు తెలిపారు. వీటిల్లో కాళేశ్వరం, పాలమూరు - రంగారెడ్డి, కల్వకుర్తి, దిండి, ఎస్‌ఎల్‌బీసీ, సీతారామ ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేవని ఆరోపించింది. కేటాయించిన వాటా కంటే 190 టీఎంసీలకు పైగా నీటిని తీసుకెళ్లే ప్రయత్నాల్లో తెలంగాణ ఉందని.. తాము మాత్రం తమకు కేటాయించిన నీటినే వాడుకుంటున్నామని వివరించింది. తెలంగాణ ప్రభుత్వం మొత్తం 450.31 టీఎంసీల నీటి వినియోగానికి ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టిందని ఆరోపించింది.

చంద్రబాబు ఏమంటున్నారు ?

గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పొగిడిన ఏపీ సీఎం జగన్‌ ఇప్పుడు మళ్లీ ప్రజల దృష్టి మరల్చడానికి దొంగ నాటకాలు ఆడుతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. ఇద్దరం కలసి రెండు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని వారు గతంలో చెప్పారన్నారు. గతంలో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తెచ్చి రాయలసీమలో పంటలను కాపాడాం. ముచ్చుమర్రి లిఫ్ట్‌ స్కీమ్‌ పూర్తి చేసింది టీడీపీ ప్రభుత్వమే. ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌కు, బనకచర్లకు నీరు వాడుకోవచ్చు. తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టులన్నింటికీ నాంది పలికింది మేమే. ఐదేళ్లలో 23 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి 32 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని తెలిపారు.

తాజాగా మాకు ఎటువంటి బేసిన్లు, భేషజాలు లేవు. ఇద్దరం నీళ్లు వాడుకుందాం. ఇరు రాష్ట్రాలకు సరిపోను 1000 టీఎంసీలు ఉన్నాయి. పిచ్చి కొట్లాటలు బంద్ చేయాలని ఆనాడు చెప్పాం. చంద్రబాబు ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీమే సవాల్. బాబ్లీ మీద కొట్టాట పెట్టుకొని ఏమైనా సాధించాడా. ఒక్క టీఎంసీ ఐనా సాధించారా? కానీ మేం సాధించాం. 7 సార్లు వెళ్లి మహారాష్ట్ర సీఎంతో మాట్లాడి పరిష్కరించాం. కాళేశ్వరం నుంచి 100 టీఎంసీలను సాధించి పంటలను పండించుకుంటున్నాం. ఇలా చేయాలని చెప్పాం. కాదు వేరే.. అంటే తేడాకొస్తుంది.’ అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల మీద రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గోదావరి మిగులు జలాలను ఎవరు తీసుకున్నా అభ్యంతరం లేదని.. చిల్లర పంచాయతీలతో ఏమీ సాధించమని చెప్పినట్లు గుర్తు చేశారు.