Coronavirus in India: ఆ ఎనిమిది రాష్ట్రాల్లోనే కరోనా సెకండ్ వేవ్ కల్లోలం, పెరుగుతున్న ఆర్ ఫ్యాక్టర్, దేశంలో కొత్తగా 42,625 మందికి కరోనా పాజిటివ్‌, మళ్లీ నాలుగు లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
coronavirus ward in hospital

New Delhi, August 4: కరోనా వైరస్ కేసులు మరోసారి పెరిగాయి. అంతకుముందు రోజు 30,549 కేసులు (Coronavirus in India) నమోదు కాగా.. తాజాగా 42 వేలకుపైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. నిన్న 500కిపైగా మరణాలు సంభవించాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. తాజాగా 42,625 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసులు 3.17కోట్లకు చేరాయి. నిన్న 562 మంది ప్రాణాలు (COVID 19 Deaths in India) కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 4,25,757కు చేరుకుంది. ఇటీవల క్రియాశీల కేసులు మళ్లీ నాలుగులక్షల మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 4,10,353 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.29 శాతానికి పెరిగింది.

తాజాగా 36,668 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.09 కోట్లకు చేరగా.. ఆ రేటు 97.37 శాతంగా ఉంది. నిన్న 18,47,518 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 47కోట్లకుపైగా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. అలాగే నిన్న 62.53లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 48 కోట్ల మార్కును దాటింది.

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వస్తుందా, నోటుపై వైరస్ ఎంతకాలం అంటుకుని ఉంటుంది, కరెన్సీ ద్వారా Sars-Cov-2 వైరస్ వ్యాప్తిపై నిపుణుల పరిశోధనలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దామా..

కరోనా సెకండ్ వేవ్ కల్లోలం ముగిసిపోలేదని.. జాగ్రత్తలు పాటించడంలో, కరోనా కట్టడి చర్యల్లో నిర్లక్ష్యానికి చోటివ్వొద్దని కేంద్ర ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. 8 రాష్ట్రాల్లో కొవిడ్‌ వ్యాప్తి తీవ్రతను తెలిపే ‘ఆర్‌ ఫ్యాక్టర్‌’ (రీప్రొడక్షన్‌ నంబర్‌) 1 దాటినట్లు మంగళవారం తెలిపింది. హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌, లక్షద్వీప్‌, తమిళనాడు, మిజోరం, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ వంటి 8 రాష్ట్రాల్లో ‘ఆర్‌’ విలువ 1 కంటే ఎక్కువగా ఉన్నది.కరోనా వైరస్‌ డెల్టా రకం వ్యాప్తి చెందుతోందని.. రెండో ఉద్ధృతి తీవ్రంగానే ఉందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ పునరుద్ఘాటించారు.

చైనాలో మళ్లీ లాక్‌డౌన్, ఆ దేశంలో డేంజర్‌గా మారిన డెల్టా వేరియంట్, పదికిపైగా ప్రావిన్స్‌ల్లో డెల్టా కేసులు నమోదు, వుహాన్‌లో అందరికీ కరోనా టెస్టులు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు

ఆర్‌ ఫ్యాక్టర్‌ 0.6 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. అది 1 దాటితే కొవిడ్‌ వ్యాప్తి తీవ్రతను తెలుపుతుంది’’ అని పేర్కొన్నారు. గణాంకాలతో సహా ఆయన కొవిడ్‌ పరిస్థితిని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల్లో కొంత తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. పశ్చిమబెంగాల్‌, నాగాలాండ్‌, హరియాణా, గోవా, దిల్లీ, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లో ఆర్‌ ఫ్యాక్టర్‌ 1గా ఉన్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఆగస్టు 2తో ముగిసిన వారానికి 12 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం మించి నమోదైనట్లు తెలిపారు.

మరో ప్రమాదం..కరోనా పేషెంట్లలో కుళ్లిపోతున్న ఎముకలు,పేషెంట్లు కోలుకున్న 60 రోజుల తర్వాత వారిపై ఎవాస్క్యులర్‌ నెక్రోసిస్‌ వ్యాధి దాడి, ఇప్పటికే ముంబైలో మూడు బోన్‌ డెత్‌ కేసులు నమోదు

కేరళ, మహారాష్ట్ర, మణిపుర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ సహా 6 రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో గత 4 వారాలుగా రోజువారీ కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు. దేశంలో గత వారం నమోదైన మొత్తం కేసుల్లో 49.85 శాతం ఒక్క కేరళలోనే బయట పడ్డాయన్నారు. ఆర్‌ ఫ్యాక్టర్‌ 1 దాటిన చోట కొవిడ్‌ కట్టడికి పకడ్బందీ చర్యలు అవసరమని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. నిపుణుల గణన ప్రకారం.. ‘ఆర్‌ ఫ్యాక్టర్‌’ 1 అంటే కొవిడ్‌ బారిన పడిన ప్రతిఒక్కరి ద్వారా మరొకరికి ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందడం. అదే 1 దాటితే వైరస్‌ సోకిన ప్రతి ఒక్కరి ద్వారా ఒకరి కంటే ఎక్కువ మందికి వ్యాప్తి చెందుతుంది.

కరోనా నుంచి కోలుకున్న వారిలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు, శరీరంలోని పది అవయవ వ్యవస్థల్లో సుదీర్ఘ కాలం పాటు 203 లక్షణాలు, లాన్సెట్‌ తాజా అధ్యయనంలో వెల్లడి

‘ఆర్‌’ విలువ 1 కంటే ఎక్కువగా ఉంటే కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు అర్థంచేసుకోవాలని, ఇలాంటి పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించాల్సిన అవసరమున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, భారత్‌లో ఆర్‌ విలువ సగటున 1.2గా ఉన్నట్టు పేర్కొన్నారు. దీన్నిబట్టి వ్యాధిసోకిన ఒక వ్యక్తి ఒకరికంటే ఎక్కువమందికి వైరస్‌ను సోకేలా చేస్తున్నట్టు అర్థంచేసుకోవాలన్నారు. కాగా వైరస్‌ వ్యాప్తి రేటును తెలియజేసేందుకు ‘ఆర్‌-ఫ్యాక్టర్‌’ సాయపడుతుంది. ‘ఆర్‌’ విలువ 2గా ఉంటే వైరస్‌ రోగి నుంచి మరో ఇద్దరికి మహమ్మారి సోకినట్టు అర్థం.