Coronavirus Cases in AP (Photo Credits: PTI)

New Delhi, Feb 1: దేశంలో గత 24 గంటల్లో 8,635 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 13,423 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,66,245 కు (Covid Updates in India) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 94 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,54,486కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,04,48,406 మంది కోలుకున్నారు.

1,63,353 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 39,50,156 మందికి వ్యాక్సిన్ (Covid Vaccination) వేశారు.కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 19,77,52,057 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,59,422 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

ఏపీలో గడచిన 24 గంటల్లో 21,922 కరోనా టెస్టులు నిర్వహించగా 64 మందికి పాజిటివ్ (Covid Positive) అని తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 10, కృష్ణా జిల్లాలో 9, నెల్లూరు జిల్లాలో 8, గుంటూరు జిల్లాలో 7 కేసులు గుర్తించారు. ప్రకాశం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

సెస్ అంటే ఏమిటి..పెరిగే ధరలు, తగ్గే ధరలు ఏంటో తెలుసా, మద్యం కొనాలంటే ఇక చుక్కలే, ముబైల్ ఫోన్ల ధరలు మరింత ప్రియం, సెస్ ద్వారా రూ. 30 వేల కోట్ల ఆదాయం, పెరిగే తగ్గే వాటిపై ఓ లుక్కేసుకోండి

అదే సమయంలో 99 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది. కృష్ణా జిల్లాలో ఒకరు కరోనాతో మృతి (Covid Deaths) చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,87,900 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,79,504 మంది ఆరోగ్యవంతులయ్యారు. 1,242 మందికి చికిత్స కొనసాగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 7,154కి చేరింది.

ఏపీ రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ చురుగ్గా సాగుతోంది. జనవరి 31 నాటికి 1,87,252 మందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ లబ్ధిదారుల సంఖ్యలో 9వ స్థానంలో ఏపీ ఉంది. అయితే జనాభా ప్రాతిపదికన రాష్ట్రాల పరంగా చూస్తే మన రాష్ట్రం పెద్ద రాష్ట్రాల కంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ వేసింది. జనాభా ప్రాతిపదికన ఎక్కువ మంది వ్యాక్సిన్‌ వేసిన రాష్ట్రాల్లో రాష్ట్రం 5వ స్థానంలో నిలిచింది.

దేశంలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 4,63,793 మందికి వ్యాక్సిన్‌ వేయగా అత్యల్పంగా డామన్‌ అండ్‌ డయ్యూలో 391 మందికి వేశారు. పెద్ద రాష్ట్రాల్లో తమిళనాడు అత్యల్పంగా 1.05 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేసింది. జనవరి 31 రాత్రి 9 గంటల సమయానికి దేశవ్యాప్తంగా 37,58,843 మందికి వ్యాక్సిన్‌ వేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

సామాన్యుల నడ్డి మళ్లీ విరగనుందా.., పన్ను చెల్లింపుదారులకు కనపడని మినహాయింపులు,పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు, తగ్గనున్న బంగారం, వెండి ధరలు, భారీగా పెరిగిన ద్రవ్యలోటు

ఇదిలా ఉంటే కరోనావైరస్‌ సోకిన తర్వాత ఊపిరితిత్తుల్లోని కణాల్లో ఎటువంటి మార్పులు సంభవిస్తాయో తెలియజేసే ఒక సమగ్రమైన మ్యాప్‌ను బోస్టన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఊపిరితిత్తులను చేరిన గంటల వ్యవధిలోనే కరోనా విజృంభించి కణాలను ధ్వంసం చేయడం మొదలుపెడుతుందని గుర్తించినట్టు వారు తెలిపారు. ఈ పరిశోధనలో భాగంగా ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన కొన్ని లక్షల ఊపిరితిత్తుల కణాలకు ఒకేసారి కరోనా సోకేలా చేశారు.