Coronavirus Count in India: కొంపముంచిన కోయంబేడు, తమిళనాడులో 8 వేలు దాటిన కేసులు, దేశంలో 74 వేలు దాటిన కోవిడ్ 19 కేసులు
Coronavirus outbreak in India (Photo Credits: IANS)

New Delhi, May 13: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ (Coronavirus Count in India) కొన‌సాగుతూనే ఉన్న‌ది. రోజురోజుకు వేల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. కరోనా సంబంధిత మరణాలు, పాజిటివ్‌ కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) నానాటికీ పెరిగిపోతోంది. కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. లాక్‌డౌన్‌ 4కు సిద్ధమవండి, మే 18లోపు పూర్తి వివరాలు, కరోనాపై పోరాటంలో అలసిపోవద్దు, కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

గత 24 గంటల్లో 3,525 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 122 మంది మృతి చెందారని పేర్కొంది. దేశంలో మొత్తం కేసులు 74281కు చేరుకున్నాయి. ఇప్పటివరకు 24,386 మంది డిశ్చార్జ్‌ అవ్వగా, 2415 మంది మృతి చెందారని తెలిపింది. దేశంలో ప్రస్తుతం 47,480 యాక్టివ్‌ కేసులున్నాయని వెల్లడించింది.

కోవిడ్ -19 లాక్‌డౌన్ నాల్గవ దశ ఉంటుందని, అయితే మార్చి 25 నుంచి వచ్చిన మూడు లాక్‌డౌన్‌ల కన్నా (Three Lcokdwons) రానున్న నాలుగవ దశ లాక్ డౌన్ లో (Lockdown 4) విభిన్న నిబంధనలు ఉంటాయని, మే 17 తో మూడవ దశ లాక్ డౌన్ ముగియనుందని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) మంగళవారం చెప్పారు."లాక్డౌన్ 4.0 పూర్తిగా భిన్నంగా ఉంటుంది మరియు కొత్త నియమాలను కలిగి ఉంటుంది. నియమాలను పాటించడం ద్వారా వైరస్‌తో పోరాడుతూ, ముందుకు సాగుతారని నాకు నమ్మకం ఉంది, ”అని మోడీ అన్నారు. ముఖ్యమంత్రులు ఇచ్చిన సూచనల ఆధారంగా కొత్త నిబంధనలు రూపొందించామని తెలిపారు. రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజి, ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం చేయాల్సిందే, భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచం నమ్ముతోంది, జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

COVID-19 వ్యాప్తితో నాశనమైన ఆర్థిక వ్యవస్థను చైతన్యం నింపడానికి పిఎం మోడీ భారీ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. రూ .20 లక్షల కోట్ల విలువైన ఈ రిలీఫ్ ప్యాకేజీ కార్మికులు, రైతులు, చిన్న-మధ్య తరహా పారిశ్రామికవేత్తలు, పారిశ్రామికవేత్తల జీవితాలను మెరుగుపర్చడానికి ఉద్దేశించబడింది. 54 వేల టికెట్లను జారీ చేసిన రైల్వే శాఖ, రైల్వే స్టేష్టన్‌లో ఆరోగ్య పరీక్షలు, ప్రతి ప్రయాణీకుల డేటా ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని తెలిపిన DG RPF Arun Kumar

తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించే సమయానికి 26 కేసులు ఉన్న తమిళనాడులో మే నాటికి బాగా పెరిగి ఢిల్లీని దాటేసింది. ఇప్పుడు దేశంలో కరోనా బాధిత రాష్ట్రాలలో మూడవ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 3.35 శాతం ఉంటే తమిళనాడులో 0.67 శాతంగా ఉంది. చెన్నైలో కోయంబేడు హోల్‌సేల్‌ మార్కెట్‌ కోవిడ్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. ఈ మార్కెట్‌ ద్వారా దాదాపుగా 2 వేల మందికి కరోనా వైరస్‌ సోకింది. . ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ, సర్కార్‌ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడు, రైతు జేబులోకి, 21వ శతాబ్దం భారత్‌దేనని తెలిపిన ప్రధాని మోదీ

1996లో ఏర్పాటైన మార్కెట్లో 3750 దుకాణాలున్నాయి. ఆసియాలోపెద్దదైన ఈ మార్కెట్‌ 65 ఎకరాల్లో విస్తరించింది. ఈ మార్కెట్‌లో అమ్మకందారుడు ఒకరికి తొలుత కరోనా పాజిటివ్‌ రావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. అలా వారి సంఖ్య 2 వేలకి చేరుకుంది. దీంతో ప్రభుత్వం మే 5 నుంచి మార్కెట్‌ని మూసేసింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పుడు తమిళనాడులో 8718 కేసులు నమోదయ్యాయి. వ్యాధి నుంచి 2051 మంది కోలుకున్నారు. 53 మంది మరణించారు. మంగళవారం ఒక్క రోజే అక్కడ దాదాపుగా 716 కేసులు నమోదయ్యాయి.