Vimalakka Save Nallamala Song: విమలక్క బతుకమ్మ పాటకు ఫిదా అయిన పవన్ కళ్యాణ్, సేవ్ నల్లమల అంటూ ట్విట్టర్లో ట్వీట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న  సేవ్ నల్లమల బతుకమ్మ పాట, తెలంగాణాలో అంబరాన్ని తాకిన బతుకమ్మ సంబరాలు
save-nallamala-song-by-vimalakka-for-safeguarding-nallamala-is-quite-inspirational (Photo-twitter)

Septemeber29:  గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో సేవ్ నల్లమల (SaveNallamala)ఉద్యమం నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేఫథ్యంలోనే అందరూ ఏకమై సేవ్ నల్లమల అంటూ సోషల్ మీడియా వేదికగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. తెలంగాణా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మిన్నంటాయి. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ పండుగ సందర్భంగా వివిధ సంస్థలు, చానెళ్లు ప్రత్యేకంగా పాటలను రూపొందించి విడుదల చేశాయి. అయితే వీటికి పూర్తిగా భిన్నంగా సేవ్ నల్లమల అంటూ విమలక్క బతుకమ్మ పాట ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రజా సమస్యలపై పాటలతో గొంతెత్తె విమలక్క విడుదల చేసిన పాట జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బాగా నచ్చింది. వెంటనే దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

పవన్ కళ్యాణ్ ట్వీట్

నల్లమల అడవుల రక్షణపై ఈ పాటను రూపొందించారు. నల్లమల ఫారెస్టులో ఉన్న విలువైన సంపద గురించి చెబుతూనే.. మరోవైపు తాము ఎలా పోరాటం చేస్తామనే విషయాన్ని విమలక్క తన పాటలో పొందుపర్చారు. ఏపీ, తెలంగాణాలో విస్తరించిన నల్లమలపై కేంద్రం కన్ను

ఇదిలా ఉంటే నల్లమల ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలకు అనుమతించబోమని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.. సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. సినీ ప్రముఖుల నుంచి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, యువజన సంఘాలు.. ఇలా సేవ్ నల్లమల పేరుతో సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నారు. ఇప్పటికే జనసేన అధినేత యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా గొంతెత్తారు. సీఎం వైఎస్ జగన్ తన వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణా సీఎం

తెలంగాణలో ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆడపడుచులంతా ఉదయాన్నే సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మలను అలంకరిస్తున్నారు.మొత్తం ఎనిమిది రోజుల పాటు ఈ సంబరాలు జరుపుతారు. కాగా, తొలిరోజు, చివరిరోజు బతుకమ్మ సంబరాలు వైభవంగా నిర్వహిస్తారు. రకరకాల పూలతో పెద్ద పెద్ద బతుకమ్మలను చేసి.. ఆలయాలు, పార్కులు వంటి ప్రదేశాల్లో.. ఆడపచులంతా ఒకచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ కనువిందు చేస్తారు.

9 రోజుల బతుకమ్మ సంబరాలు హైలెట్స్:

మొదటి రోజు :ఎంగిపూల బతుకమ్మ- ఈ రోజు మహా అమావాస్యను పురస్కరించుకుని మొదటి బతుకమ్మను తయారుచేస్తారు. తెలంగాణలో దీన్ని పెత్రామస అని అంటారు. నువ్వులు, బియ్యపుపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

రెండవ రోజు :అటుకుల బతుకమ్మ- ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు రెండువ రోజు బతుకమ్మ చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి పెడతారు.

మూడవరోజు: ముద్ధపప్పు బతుకమ్మ- మూడవ రోజు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

నాలుగవ రోజు: నానబియ్యం బతుకమ్మ- నాలుగోరోజు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

అయిదవ రోజు: అట్ల బతుకమ్మ- ఐదవ రోజు అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.

ఆరవ రోజు: అలిగిన బతుకమ్మ- ఆరో రోజు ఆశ్వయుజ పంచమి వస్తుంది. బతుకమ్మ అలక కాబట్టి నైవేద్యం ఏమీ సమర్పించరు.

ఏడవరోజు: వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

ఎనిమిదవ రోజు: వెన్న ముద్దల బతుకమ్మ- ఏడవ రోజు నువ్వులు, వెన్న కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.

9వ రోజు : సద్దుల బతుకమ్మ- ఆశ్వయుజ అష్టమి నాడు అదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. మొత్తం ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం ప్రత్యేకంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.