Jayadev Galla: గల్లా జయదేవ్‌పై నాన్ బెయిలబుల్ కేసులు, గుంటూరు సబ్ జైలుకు తరలింపు, బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి కోర్టు, అమరావతి కోసం తన పోరాటం కొనసాగుతుందన్న టీడీపీ ఎంపీ
TDP MP Galla Jayadev (Photo-ANI)

Amaravathi, January 21: వైసీపీ ప్రభుత్వం (YCP Govt) మూడు రాజధానుల (3 Capitals) నిర్ణయానికి నిరసనగా చేపట్టిన అసెంబ్లీ ( AP Assembly)ముట్టడి ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ముట్టడికి రాజధాని రైతులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో రైతులకు (Farmers)మద్దతుగా వచ్చిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై(TDP MP Galla Jayadev) కూడా పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేసారు.

అమరావతిలోని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ చేసి పోలీసులు గుంటూరు సబ్ జైలుకు (Guntur Sub Jail ) తరలించారు. ఆయనపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

టీడీపీకి భారీ షాక్, 3 రాజధానుల బిల్లు చర్చకు ముందే ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా

ఆపై ఆయన్ను వివిధ స్టేషన్లు తిప్పుతూ అర్ధరాత్రి దాటిన తరువాత మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. తనకు బెయిల్ ఇవ్వాలని జయదేవ్ చేసిన అభ్యర్థనను తిరస్కరించిన మేజిస్ట్రేట్, 14 రోజుల రిమాండ్ విధించారు.

Here"s ANI Tweet

దీంతో తెల్లవారుజాము సమయంలో గుంటూరు సబ్ జైలుకు గల్లా జయదేవ్ ను తరలించారు. ఈ ఉదయం ఆయన మరోసారి బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీంతో మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు?

Here"s ANI Tweet

నిన్న పోలీసుల నిషేధాజ్ఞలను దాటుకుని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి గల్లా జయదేవ్ వ్యూహాత్మకంగా చేరుకున్నారు. అక్కడ పోలీసులు జయదేవ్ ను అడ్డుకున్నారు. ఆ తర్వాత జయదేవ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దుగ్గిరాల, పెదకాకాని, గుంటూరు మీదుగా నరసరావుపేట.. అక్కడి నుంచి రొంపిచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు.

చంద్రబాబు అరెస్ట్, 3 రాజధానుల బిల్లు అమోదం

అనంతరం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. రొంపిచర్ల పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు తీసుకొచ్చిన పోలీసులు.. అర్ధరాత్రి వరకూ పోలీసు వాహనంలోనే కూర్చోబెట్టారు. అర్ధరాత్రి 12.30 గంటలకు జీజీహెచ్ వైద్యులతో జయదేవ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. తెల్లవారుజామున సబ్ జైలుకి తరలించారు.

సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని

పోలీసుల తీరుపై గల్లా జయదేవ్ మండిపడ్డారు. తనపై పోలీసులు దాడి చేశారని.. తన చొక్కా చించేశారని మండి పడ్డారు. తన తాత బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకు వెళ్లారని.. తాను కూడా ప్రభుత్వం తీసుకున్న అప్రజాస్వామికమై నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లానన్నారు. అమరావతి కోసం తన పోరాటం కొనసాగుతుందన్నారు.