Woman Gang Raped: ఒంటరి మహిళపై గ్యాంగ్ రేప్, మరోచోట అన్నే కామాంధుడయ్యాడు, ఇంకోచోట తమ్ముడి కోసం కామాంధుడికి బలైన ఓ అక్క, బిడ్డ తలపై తుఫాకీ పెట్టి తల్లిపై అత్యాచారం
Representational Image (Photo Credits: File Image)

Nizamabad, August 26: తెలంగాణలో నిజామాబాద్ లో అర్దరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రికి వెళ్లి తిరిగివస్తున్న మహిళను 12 మంది గ్యాంగ్ రేప్ (Woman Gang Raped) చేసారు. వివరాల్లోకి వెళితే ...జిల్లాలోని ఎడపల్లి మండలానికి చెందిన ఓ మహిళ సోమవారం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. బాధితురాలిని ఆమె సోదరి నిజామాబాద్ (Nizamabad) లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చింది. పని నిమిత్తం సోమవారం రాత్రి నిజామాబాద్ రైల్వే స్టేషన్ ( Nizamabad railway station) సమీపంలోకి వెళ్లింది. అక్కడ ఒంటరిగా ఉన్న మహిళను విక్కీ అనే యువకుడు గమనించాడు. ఆమెతో మాట కలిపి సాయం చేస్తానని నమ్మించాడు. అక్కడ ఉన్న రెవెన్యూ భవన్ లోని ఖాళీ గదిలో మహిళ పై విక్కీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత అక్కడకి అతని 11 మంది స్నేహితులు చేరుకున్నారు. వారు కూడా ఆమె పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అదే సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం అక్కడకు రావడంతో యువకులు పరారయ్యారు. అచేతనంగా ఉన్న మహిళను పోలీసులు గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడింది నగరంలోని హమాల్‌వాడీకి చెందిన యువకులని.. విక్కీ పెయింటర్‌గా పని చేస్తాడని వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తెలిపారు. అయితే, పెట్రోలింగ్‌ సిబ్బంది సమాచారం మేరకు 8 మంది అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని చెప్పారు.

బీహార్ లో దారుణం

బీహార్‌లో ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారం చేసిన అమానుష ఘటన తాజాగా వెలుగుచూసింది. ముజఫర్‌పూర్ జిల్లాకి చెందిన వివాహిత భర్తతో కలసి నివాసముంటోంది. ఆరు నెలల కిందట మగబిడ్డకు జన్మనిచ్చింది. భర్త ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలకు వెళ్లడంతో కొద్దికాలంగా ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆమెపై కన్నేసిన అదే ప్రాంతానికి చెందిన కామాంధులు అదే అదనుగా భావించారు. అర్ధరాత్రి వేళ చుంచున్ కుమార్, సజన్, శ్రీరామ్, శివ, బాబు కుమార్ బలవంతంగా ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేసేందుకు యత్నించడంతో వివాహిత ప్రతిఘటించింది. లైవ్ మీటింగ్‌, సెక్స్‌లో మునిగిపోయిన ఉద్యోగి, బ్రెజిల్‌లోని రియో డి జనీరో మున్సిపాలిటీ కౌన్సిలర్ల సమావేశంలో ఘటన, వైరల్ అవుతున్న వీడియో

దీంతో ఆగ్రహం చెందిన దుర్మార్గులు ఆమె ఆరు నెలల కొడుకు తలపై తుపాకీ గురిపెట్టి చంపేస్తామని బెదిరించి తల్లిపై సామూహిక అత్యాచారం చేశారు. ఐదుగురు దుండగులు దారుణంగా రేప్ చేశారు. అంతటితో ఆగని కామాంధులు రేప్‌ చేస్తూ వీడియోలు తీసి పైశాచికం ప్రదర్శించారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తీరా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేపింది. కామాంధులను కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఉత్తరాఖండ్ లో మరో కీచక పర్వం

ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌ గవర్నమెంట్ క్వార్టర్స్‌లో నివాసముంటున్న బాలిక(11)ను బాత్రూమ్‌లోనే ఓ కీచక ఏఎస్సై అత్యాచారం చేశాడు. ఆమె ఒంటరిగా కనిపించడంతో బాలికని బాత్రూమ్‌లో బంధించి ఎమర్జెన్సీ 112 హెల్ప్‌లైన్ సెంటర్‌ ఏఎస్సై సంజీవ్ జుగాడి అత్యాచారం చేశాడు. బాత్రూమ్‌కి వెళ్లిన కూతురు ఎంతసేపటికీ తిరిగిరాలేదని అనుమానంతో తల్లి రావడంతో ఏఎస్సై కీచకపర్వం వెలుగుచూసింది. బాత్రూమ్ వద్దకెళ్లిన తల్లి బయటి నుంచి ఎంత పిలిచినా కూతురు పలకలేదు. లోపల నుంచి గడియ పెట్టి ఉండడంతో గట్టిగా పిలిచింది.నిద్రలో మనిషి ఫ్యాంటులో దూరిన పాము, ఏకంగా ఏడు గంటల పాటు నరకం చూపించింది, ఉత్తరప్రదేశ్‌లో మీర్జాపూర్‌ జిల్లాలో భయంకరమైన సంఘటన

కొద్దిసేపటికి ఏఎస్సై సంజీవ్ జాగుడి బాత్రూమ్‌లో నుంచి బయటికొచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. లోపలికి వెళ్లి చూడగా బాలిక అపస్మారక స్ధితిలో పడి ఉండడం చూసి తల్లి షాక్‌కి గురైంది. అత్యాచారానికి గురైన కూతురిని తీసుకుని ఇంటికెళ్లింది. ఆ విషయం స్థానికులకు విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఏఎస్సైని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.

గుంటూరు జిల్లాలో అన్నే కామాంధుడు

గుంటూరు జిల్లాలో వరుసకు చెల్లెలు అయ్యే బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అచ్చంపేట మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఓ బాలిక (11)కు అదే గ్రామానికి చెందిన చిలకా షడ్రక్‌ (23) అన్న వరుస అవుతాడు. శుక్రవారం తల్లిదండ్రులు కూలిపనికి వెళ్లడంతో బాలిక ఒంటరిగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఆ కామాంధుడు సాయంత్రం వేళ ఆమె ఇంటికి వెళ్లాడు. అన్నయ్యే కదా అని బాలిక అతడిని లోపలికి రానిచ్చింది. కాసేపు సరదాగా కబుర్లు చెప్పిన షడ్రక్ ఆ తర్వాత బాలికను బాత్రూమ్‌లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి కామాంధుడు పరారయ్యాడు. ఈ బాలీవుడ్‌ నిర్మాత బైసెక్సువల్‌, తనను ద్విలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్న బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ వికాస్‌​ గుప్తా, గర్వంగా ఉందంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడి

కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురు ఏడుస్తూ ఉండటాన్ని గమనించారు. ఏం జరిగిందని ఆరా తీయగా షడ్రక్ చేసిన అఘాయిత్యం గురించి బాలిక వివరించింది. దీంతో వారు వెంటనే అచ్చంపేట ఎస్ఐ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగిన ఎస్ఐ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సత్తెనపల్లి డీఎస్పీ ఆర్‌.విజయభాస్కర్‌రెడ్డి, సత్తెనపల్లి గ్రామీణ సీఐ నరసింహారావులు గ్రామంలో పర్యటించి ఘటన తాలూకు వివరాలు సేకరించారు.

దేశ రాజధానిలో మరో కీచక పర్వం

తమ్ముడిని కాపాడుకునేందుకు పన్నెండేళ్ల బాలిక కామాంధుడికి లొంగిపోయిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన ఎనిమిదేళ్ల తమ్ముడు, అక్క(12) డెలివరీ ఏజెంట్ కోసం రాజౌరి గార్డెన్ ఏరియాలో ఎదురుచూస్తుండగా నీరజ్ కొల్హి(42) గమనించాడు. మద్యం మత్తులో ఉన్న నీరజ్ కామంతో బాలికపై కన్నేశాడు. ఆమె తమ్ముడిని అమాంతం పార్కులోకి ఈడ్చుకెళ్లి రేప్ చేస్తానని బెదిరించడంతో బాలికని హడలిపోయింది. సోదరుడికి హాని చేస్తాడేమోనన్న భయంతో ఆమె లొంగిపోయింది. ఆ దుర్మార్గుడు ఆమెను బలవంతంగా పార్కులోకి తీసుకెళ్లి ఓరల్ సెక్స్ చేయాలంటూ నీచానికి దిగాడు. ఆమెను వివస్ర్తను చేసి అసభ్యకర రీతిలో ఫొటోలు తీసి వేధింపులకు గురిచేశాడు.

అక్కడి నుంచి ఎలాగో తప్పించుకుని ఇంటికి చేరిన బాధితులు విషయం పేరెంట్స్‌కి చెప్పడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు నీరజ్‌‌ని జూట్ కంపెనీ యజమానిగా గుర్తించారు. డ్రగ్స్‌కి బానిసైన నీరజ్ బాలికపై దారుణానికి పాల్పడినట్లు తేల్చారు. బాధితురాలి తండ్రి అక్కడికి సమీపంలోని దుకాణం నడుపుతున్నారని.. అక్కాతమ్ముళ్లు పార్శిల్ తీసుకెళ్లేందుకు అక్కడికి వచ్చిన సమయంలో ఈ దారుణం జరిగినట్లు గుర్తించారు.