Uttar Pradesh: భూవివాదం..బాలికపై 11 మంది సామూహిక అత్యాచారం, అనంతరం గొడ్డలితో నరికిన ప్రత్యర్థులు, ఆ బాలిక కుటుంబంలో నలుగురుని అదే గొడ్డలితో నరికేశారు, యూపీలో దారుణ ఘటన వెలుగులోకి
Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Lucknow, Nov26: ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడ జరిగిన భూ వివాదం ఓ కుటుంబాన్ని పొట్ట‌న ( Family Of 4 Murdered In Prayagraj) పెట్టుకున్న‌ది. ప్రత్యర్థులు ఇంట్లో ఉన్న బాలిక‌పై సామూహిక లైంగికదాడి (Teen Was Allegedly Gang-Raped) చేసిన అనంతరం గొడ్డ‌లితో న‌రికేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌యాగ్‌రాజ్ జిల్లాకు చెందిన ఓ ద‌ళిత కుటుంబానికి, అగ్ర కుల‌స్తుల‌కు మ‌ధ్య గ‌త రెండు, మూడేండ్ల‌ నుంచి భూ వివాదాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అగ్ర కుల‌స్తులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

ద‌ళిత కుటుంబాన్ని రాజీ చేసేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించారు. కానీ త‌మ‌కు ద‌క్కాల్సిన భూమి విష‌యంలో ద‌ళిత కుటుంబం ప‌ట్టువీడ‌వ‌లేదు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో కూడా పోలీసులు ఎస్సీల‌ను కాంప్ర‌మైజ్ చేసేందుకు య‌త్నించి విఫ‌ల‌మ‌య్యారు. అగ్ర కుల‌స్తుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు అయ్యాక‌, సెప్టెంబ‌ర్ 21న ఎస్సీ కుటుంబంపై దాడి చేశారు. అప్పుడు కంప్లైంట్ ఇచ్చినా సీఐ పట్టించుకోలేదని, నిందితుల ఇంట్లో కూర్చుని సెటిల్‌మెంట్ చేసే ప్రయత్నం చేశారని అన్నారు.

సుజనా ఫౌండేషన్‌ సీఈవో ఏకే రావుది హత్యేనా, పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఏం చెబుతోంది, బెంగళూరులోని రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో గాయని హరిణి తండ్రి మృతదేహం

దాదాపు వారం రోజుల పోరాడిన తర్వాత గానీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టలేదని చెప్పారు. అయితే ఆ తర్వాత నిందితులు కంప్లైంట్ ఇచ్చారని రివర్స్‌ కేసులు కూడా పెట్టారని వివరించారు. దాడి తర్వాత హత్యకు గురైన వారితో పోలీసులు రాజీ చేసుకోవాలని బలవంతం చేశారు.. సుశీల్ కుమార్ (పోలీస్ కానిస్టేబుల్) మా దగ్గరకు వచ్చి రాజీకి ఒత్తిడి చేసేవాడు. పోలీసులు వారి (నిందితులు) ఇళ్ల వద్ద కూర్చునేవారు.. స్థానిక ఇన్‌స్పెక్టర్ కూడా రాజీకి ప్రయత్నించారు... సెప్టెంబరు 21న దాడికి పాల్పడితే వారం తర్వాత మాత్రమే ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది.. బాధిత కుటుంబంపై కూడా కౌంటర్ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు’’ అని బాధిత కుటుంబానికి చెందిన బంధువు పేర్కొన్నారు.

కామాంధులకు చిక్కిన మైనర్ బాలిక, తండ్రితో సహా 28 మంది రాజకీయ నేతలు దారుణంగా అత్యాచారం, కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు

మృతుల్లో ఇద్దరు పిల్లలతో పాటు వారి 45 ఏళ్ల తల్లి, 50 ఏళ్ల తండ్రి ఉన్నారని చెప్పారు. గొడ్డలి, కత్తులతో దాడి చేసి ఈ హత్యలు చేశారని, ముగ్గురి మృతదేహాలు హాల్‌లో ఉండగా, బాలిక మృతదేహం మాత్రం లోపలి గదిలో ఉందని పోలీసులు చెప్పారు. ఈ కేసుల్లో వేర్వేరు టీమ్స్‌గా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులకు కఠినంగా శిక్షలు పడేలా చూస్తామని ప్రయాగ్‌రాజ్ పోలీస్ ఉన్నతాధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పారు.

యూపీ హత్రాస్‌లో మరో దారుణం, లైంగిక వేధింపుల బాధితురాలి తండ్రి హత్య, జైలు నుంచి బయటకు వచ్చి కాల్చి చంపిన నిందితుడు, న్యాయం చేయాలంటూ కన్నీరు మున్నీరుగా విలపించిన భాదితురాలు

ఈ ఘటనపై కేసు నమోదుచేసినట్టు ఆయన తెలిపారు. మొత్తం 11 మందిపై సామూహిక అత్యాచారం, హత్య కేసు నమోదయ్యిందని, కొందర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ప్రయాగ్‌రాజ్ పోలీస్ చీఫ్ పేర్కొన్నారు. నలుగురి తలపై గొడ్డలితో దాడిచేసినట్టు ఆనవాళ్లున్నాయి.. వారి మృతదేహాలపై బలమైన గాయాలున్నాయి. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని పోలీస్ అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠీ వెల్లడించారు.అటు బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Congress leader Priyanka Gandhi Vadra) శుక్రవారం మధ్యాహ్నం పరామర్శించనున్నారు. వారిని కలుసుకుని అండగా నిలబడతామని హామీ ఇవ్వనున్నారు.

News Source