పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో (T20 World Cup 2021) పాక్ ఫీల్డర్ హసన్ అలీ వదిలేసిన క్యాచ్ తో మ్యాచ్ స్వరూపమే మారిపోయిన సంగతి విదితమే. అప్పటిదాకా పాక్ వాకిట్లోనే ఉన్న విజయం కాస్తా.. ఆ వదిలేసిన క్యాచ్ తో ఆస్ట్రేలియా గుమ్మం తొక్కింది. క్యాచ్ డ్రాప్ తో బతికిపోయిన మాథ్యూ వేడ్.. షాహీన్ అఫ్రిదీ బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్స్ లు బాది విజయాన్ని లాగేసుకున్నాడు. దీంతో పాకిస్థాన్ ఇంటి బాట పట్టినట్టయింది.ఈ ఓటమిపై పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ( Babar Azam) స్పందించాడు.
అయితే, ఓటమికి ఆ ఒక్కడే కారణం కాదని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు. ఎవరు..ఎవరి మీదా వేలెత్తి చూపరాదని జట్టు సభ్యులకు సూచించాడు. మ్యాచ్ ( Pakistan vs Australia) అనంతరం డ్రెస్సింగ్ రూంలో అతడు జట్టు సభ్యులకు హితబోధ చేశాడు. ఈ ఒక్క ఓటమితోనే ఏమీ అయిపోలేదని, టోర్నమెంట్ లో మంచి ఆట ఆడామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించాడు. ఓటమితో బాధ కలగడం సహజమని, కానీ, ఎక్కడ పొరపాట్లు చేశామో జట్టు సభ్యులుగా అందరికీ తెలుసని, వాటి నుంచి నేర్చుకుంటూ ముందుకు పోవాలని చెప్పాడు. మళ్లీ ఆ తప్పులు జరగకుండా సరిచేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నాడు.
ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగానే వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టడానికి ప్రయత్నించాం. అయితే, ఆస్ట్రేలియా వంటి జట్టుకు ఆఖర్లో అవకాశం ఇస్తే ఎంతటి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందో తెలుసు. ఆ క్యాచ్(మాథ్యూ వేడ్)ను వదిలేయడమే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఒకవేళ ఆ క్యాచ్‌ను గనుక అందుకుని ఉంటే ఫలితం వేరేలా ఉండేది. ఒక్కటి మాత్రం నిజం.. టోర్నీ మొత్తంలో మా జట్టు ఆడిన విధానం పట్ల కెప్టెన్‌గా నేను సంతృప్తిపడుతున్నాను.
Here's Pakistan Cricket Tweet
Babar Azam, Saqlain Mushtaq and Matthew Hayden are proud of their side despite a five-wicket defeat in #T20WorldCup semi-final. pic.twitter.com/kAem5PrWjj
— Pakistan Cricket (@TheRealPCB) November 11, 2021
కీలక మ్యాచ్‌లో ఓడిపోవడం బాధాకరమే అయినా.. దీని నుంచి నేర్చుకున్న గుణపాఠం.. తదుపరి ఈవెంట్‌లో ఇలాంటి తప్పులు పునరావృతం చేయకుండా ఉండేందుకు దోహదం చేస్తుంది. టోర్నీ ఆసాంతం ఎంత బాగా ఆడినా.. ఒక్క చిన్నతప్పు కారణంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది కదా. ఏదేమైనా మా ఆటగాళ్లు ఎవరి పాత్రను వారు చక్కగా నెరవేర్చారు. ప్రేక్షకుల నుంచి మాకు గట్టి మద్దతు లభించడం సంతోషకరం. దుబాయ్‌లో ఆడటాన్ని ఎల్లప్పుడూ మేము పూర్తిగా ఆస్వాదిస్తాం’’ అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఉద్వేగభరితంగా మాట్లాడాడు.
ఓ జట్టుగా ఆడాం కాబట్టే.. ఇక్కడిదాకా వచ్చామని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ చేయొద్దని జట్టు సభ్యులకు హితవు చెప్పాడు. ‘నీ ఆట బాగాలేదు.. వాడు బాగా ఆడలేదు’ అంటూ ఎవరిపైనా వేలెత్తి చూపొద్దన్నాడు. ఎవరూ ప్రతికూలాంశాలను చర్చించకూడదన్నాడు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న జట్టు ఐక్యతను.. ఈ ఒక్క ఓటమితో దెబ్బ తీయకూడదని సహచరులకు సూచించాడు. కెప్టెన్ గా ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానన్నాడు. జట్టులో ప్రస్తుతం ఓ కుటుంబ వాతావరణం ఉందని, ప్రతి ఒక్కరూ ప్రతి గేమ్ లో బాధ్యతగా ఆడారని చెప్పాడు. మన చేతుల్లో ఉన్నది కేవలం ప్రయత్నం చేయడమేనని, ఫలితం మన చేతుల్లో లేదని తెలిపాడు. జట్టుగా ప్రయత్నిస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని హితబోధ చేశాడు.
కాగా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో సూపర్ 12 దశలో ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచిన పాకిస్తాన్.. రెండో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఫైనల్ చేరాలన్న బాబర్ ఆజమ్ బృందం ఆశలు గల్లంతయ్యాయి. మార్కస్ స్టొయినిస్(40 పరుగులు), మాథ్యూ వేడ్(41 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ పాకిస్తాన్‌ను దెబ్బకొట్టింది.
This catch drop hasan ali australia win the match
Bad luck😭😭😭😭 pic.twitter.com/URopr2ptRm
— Mudassar Iqbal (@Mudassa21479018) November 12, 2021
ప్రధానంగా షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో వేడ్.. ఇచ్చిన క్యాచ్‌ను హసన్ అలీ మిస్ చేయడం.. ఆ తర్వాత అతడు వరుసగా మూడు సిక్సర్లు బాది ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే ఆసీస్ గెలుపును ఖాయం చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఆరోన్ ఫించ్ బృందం ఫైనల్‌కు చేరింది. టీ20 వరల్డ్‌కప్ టైటిల్ కోసం నవంబరు 14న న్యూజిలాండ్‌తో తలపడనుంది.