India vs New Zealand 3rd ODI New Zealand beats India by 5 wickets, sweeps series 3-0 (Photo-IANS)

Mount Maunganui,Febuary 11: మౌంట్ మాంగనుయ్ లో టీమిండియాతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో (India vs New Zealand 3rd ODI) ఆతిథ్య న్యూజిలాండ్ (New Zealand) 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఓ వన్డే సిరీస్ లో భారత్ (India) ఇంత ఘోరంగా ఓడిపోవడం 31 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం. టీం ఇండియా నిర్దేశించిన 297 పరుగుల లక్ష్యాన్ని కివీస్ సునాయాసయంగా చేధించింది. దీనితో టి20 సీరీస్ లో ఎదురైన ఘోర పరాభవానికి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది.

రెండో వన్డేలో కోహ్లీ సేనకు తప్పని పరాభవం

ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలుపుకోవాలని భారత జట్టు బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైంది. బ్యాటింగ్ లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లి ఘోరంగా విఫలమయ్యారు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీ, లోకేష్ రాహుల్ సెంచరీలతో జట్టుని ఆదుకున్నారు. దీనితో ఆ మాత్రం స్కోర్ అయినా సాధించింది టీం ఇండియా. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీం ఇండియా ఎక్కడా కూడా స్వేచ్చగా షాట్లు ఆడలేదు.

తొలి వన్డేలో పరాజయం పాలైన భారత్

ఈ మ్యాచ్ లో భారత్ విసిరిన 297 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 47.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆల్ రౌండర్ కొలిన్ డి గ్రాండ్ హోమ్ కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో బీభత్సం సృష్టించాడు. మరోవైపు వికెట్ కీపర్ టామ్ లాథమ్ 32 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడి న్యూజిలాండ్ విజయంలో పాలుపంచుకున్నాడు.

సూపర్ ఓవర్లో మళ్లీ టీమిండియాదే గెలుపు

అంతకుముందు ఆరంభంలో ఓపెనర్లు గప్టిల్ 66, నికోల్స్ 80 పరుగులు చేసి పటిష్ట పునాది వేశారు. దాంతో మిగతా బ్యాట్స్ మెన్ పని సులువైంది. టీమిండియా బౌలర్లు మధ్యలో కొన్ని వికెట్లు తీసినా, గ్రాండ్ హోమ్, లాథమ్ వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పని పూర్తి చేశారు. కివీస్ బ్యాట్స్మెన్ లో ఓపెనర్ నికోలస్ 80 పరుగులు, గుప్తిల్ 66 పరుగులు, గ్రాండ్ హోం 58 పరుగులు చేసారు.

కివీస్‌ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్‌ను క్వీన్‌స్వీప్‌ చేసిన జట్టుగా భారత్ రికార్డు

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 296 పరుగులు చేసింది. టీమిండియా ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ (112) ఆటే హైలైట్. రాహుల్ సెంచరీతో అలరించాడు. పృథ్వీ షా 40, మనీష్ పాండే 42 పరుగులు సాధించారు. మయాంక్ (1), కోహ్లీ (9) విఫలమయ్యారు.

తొలి టీ20లో భారత్ ఘన విజయం

కాగా టీమిండియా మూడు, అంతకంటే వన్డే సిరీస్‌ల్లో వైట్‌వాష్‌ కావడం ఓవరాల్‌గా నాల్గోసారి. 1983-84 సీజన్‌లో విండీస్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో వైట్‌వాష్‌ అయిన టీమిండియా.. 1988-89లో అదే జట్టుపై మరోసారి వైట్‌వాష్‌ అయ్యింది. ఆ తర్వాత మూడు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మొత్తం మ్యాచ్‌లు జరిగిన క్రమంలో టీమిండియా వైట్‌వాష్‌ కావడం ఇదే తొలిసారి.  2006-07 సీజన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 4-0తో సిరీస్‌ను కోల్పోయినా, ఒక వన్డే జరగలేదు.