Anandayya 'New Political Party': రాజకీయాల్లోకి ఆనందయ్య, కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటన, కరోనా థర్డ్‌వేవ్ మందు తన దగ్గర ఉందని, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే అందిస్తానని తెలిపిన కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు
Anandayya New Political Party (Photo-Twitter)

Amaravati, Nov 30: కరోనాకు మందు కనిపెట్టానంటూ గతంలో సంచలనం రేపిన నెల్లూరు ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి (Anandayya Coming to Politic) వస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే బీసీల కోసం రాజకీయ పార్టీని (Anandayya New Political Party) స్థాపిస్తానని తెలిపారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు, నెల్లూరు ఆయేర్వేద వైద్యుడు ఆనందయ్య సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు.

అన్ని రాజకీయ పార్టీలు బీసీలను విస్మరిస్తున్నాయని, బీసీ జేఏసీ ద్వారా రాజకీయ పార్టీ పెడతామని తెలిపారు. కరోనా మూడో దశ ఎదుర్కునేందుకు తన వద్ద మందు ఉందని రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే అందిస్తానని ఆయన (Nellore Krishnapatnam Ayurveda doctor Anandayya) తెలిపారు. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీ చేసి ఫేమస్ అయ్యారు. ఆనందయ్య మందు బాగా పని చేస్తోందంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది.. దీంతో ఆయన ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు.

ఆనందయ్య మందు తయారీ కేంద్రాన్ని మరో చోటుకు మార్చిన అధికారులు, ఇక నుంచి కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్‌ సెక్యూరిటీ అకాడమీలో మందు తయారీ, కొరియర్ ద్వారా కృష్ణపట్నం మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న ఆనందయ్య బృందం

అయితే ఆనందయ్య మందు కొంతకాలం ఆగిపోయిన.. మొత్తానికి ఏపీ సర్కార్‌ అనుమతి ఇవ్వడంతో మందు పంపిణీ మొదలు పెట్టారు. ఆ సమయంలో ఆనందయ్యకు చాలా మంది మద్దతుగా నిలిచారు. ఆనందయ్య మందు కోసం తెలుగు వారే కాకుండా చుట్టు పక్కల రాష్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, పేషెంట్ల బంధువులు మాత్రమే కృష్ణపట్నం రావాలని సూచన, మందు పంపిణీలో కోవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించాలని ఆదేశాలు

ఈ క్రమంలో త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు. బీసీ కులాలతో కలిసి ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రథయాత్ర నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. జాతీయ నేతల అండదండలతో బలహీన వర్గాలను కలుపుకుని వెళ్లాలని ఆనందయ్య కసరత్తు చేస్తున్నారు.