Comprehensive Land Survey: ఏపీ సీఎం కీలక నిర్ణయం, సమగ్ర భూసర్వే వేగ‌వంతం చేయాలని అధికారులకు ఆదేశాలు, మూడు విడతల్లో సర్వే చేయాలని అధికారులకు సూచన
Andhra Pradesh ys-jaganmohan-reddy-review-meeting (Photo-Twitter)

Amaravati, June 8: ఏపీ సీఎం వైయస్ జ‌గ‌న్ మరో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సమగ్ర భూసర్వేను (Comprehensive Land Survey) వెంటనే ప్రారంభించాల‌ని అధికారులను ఆదేశించారు. మూడు విడ‌త‌ల్లో స‌ర్వే ప‌నులు పూర్తి చెయ్యాల‌ని.. ఇది అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అని అధికారులకు సూచించారు. మండలాల వారీగా టీమ్స్ ఏర్పాటు చేసుకుని సర్వే చేయాలన్న ముఖ్య‌మంత్రి.. సర్వే రాళ్ల ఖర్చు కూడా స‌ర్కారే భ‌రిస్తుంద‌న్నారు. వైసీపీలోకి 10 నుంచి 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబుతో ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు, సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం

క్యాంపు ఆఫీసులో సమగ్ర భూ సర్వేపై సీఎం జగన్ (AP CM YS Jagan) రివ్యూ చేశారు. ఈ సమావేశంలో సీఎం చీఫ్ అడ్వైజ‌ర్ అజేయ కల్లం, ల్యాండ్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉషారాణి..సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జూన్ 16 నుంచి ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు, ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టే అవకాశం, ఈ నెల 11న కేబినెట్ భేటీ

ఈ సంధర్భంగా సమగ్ర భూ సర్వే కోసం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. గ్రామ సచివాలయాల పరిధిలో సర్వే చేస్తామని.. ఈ సర్వే సందర్భంగా ఏమైనా వివాదాలు వస్తే పరిష్కరించడానికి మొబైల్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. డిప్యూటీ కలెక్టర్ల స్థాయిలో మొబైల్‌ కోర్టులు నడుస్తాయని, దీంతో రికార్డుల ప్రక్షాళన అవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు.

Here's AP CMO Tweet

సర్వే వివరాలను ఎప్పటికప్పుడు డిజిటల్‌ పద్ధతిలో భద్రపరిచి, ఎన్‌క్రిప్ట్‌ చేస్తామని తెలిపారు. ఈ స‌మాచారాన్ని ఎవ‌రూ దుర్వినియోగం చేయ‌కుండా… మూడు నాలుగు చోట్ల భద్రపరుస్తామని వెల్ల‌డించారు. భూ అమ్మ‌కాలు, బ‌ద‌లాయింపులు కూడా ఈజీగా ఉంటాయని, రిజిస్ట్రేషన్ల ఆటో మ్యుటేషన్‌ జరుగుతుందని వివ‌రించారు అధికారులు. సమగ్ర భూ సర్వేకోసం వినియోగిస్తున్న కార్స్‌ నెట్‌వర్క్‌ ఏవిధంగా వ‌ర్క్ చేస్తుందో సీఎంకు వివరించారు.