CM YS Jagan (Photo-Twitter/APCMO)

Amaravati, Dec 15: ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం గురించి ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి పథకం ప్రజలకు అందుతుందా లేదా అన్నది పరిశీలించాలి. మైలవరంలో 89 శాతం ఇళ్లకు సంక్షేమం అందించామని మైలవరం కార్యకర్తలతో సీఎం జగన్ (YSRC activists from mylavaram) అన్నారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో మళ్లీ ఏర్పడిన ఇంకో అల్పపీడనం, గురువారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీకి భారీ వర్ష సూచన

ఈ సారి మన టార్గెట్‌ 175 నియోజకవర్గాలు ఈ మూడున్నరేళ్లలో మైలవరంలో రూ.900 కోట్లకు పైగా లబ్ధి చేకూరింది. అర్హులైన ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నాం. ఇంత మేలు చేయగలిగాం అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అందుకే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని అడుగ గలుగుతున్నాం’’ అని సీఎం అన్నారు. ఇతర కారణాలతో సంక్షేమం అందని వారికి కూడా గడప గడప ద్వారా లబ్ధి చేకూరుస్తున్నాం.

మళ్లీ దూసుకొస్తున్న తుపాన్, రెండు మూడు రోజుల్లో మోగా విరుచుకుపడే అవకాశం, రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

జనవరి నుంచి బూత్ కమిటీలను నియమించనున్నాం. బూత్ కమిటిలో ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటున్నాం. ముగ్గురు సభ్యుల్లో కచ్చితంగా ఒక మహిళ కూడా ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి 50 ఇళ్లకు ఒక మహిళ, ఒక తమ్ముడు గృహ సారధులను నియమిస్తున్నాం. గృహ సారధులు, సచివాలయ కమిటి కన్వీనర్లు రానున్న 16 నెలలు ఇంటింటికి వెళ్లాలి’’ అని సీఎం జగన్‌ తెలిపారు.