Temple Management System in AP: ఇకపై దేవాలయాల్లో అవినీతికి తావు లేదు, టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం, అన్ని దేవాలయాలు ఒకే వ్యవస్థ కిందకు, పారదర్శకతతో కూడిన వ్యవస్థలు ఉండాలని తెలిపిన సీఎం వైయస్ జగన్
Andhra Pradesh ys-jaganmohan-reddy-review-meeting (Photo-Twitter)

Amaravati, Mar 16: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో వున్న అన్ని దేవాలయాలను ఒకే వ్యవస్థ కిందికి తీసుకువచ్చేందుకు జగన్ సర్కారు సంకల్పించింది. ఇందులో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను (Temple Management System in AP) ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభించారు.

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో వున్న అన్ని దేవాలయాలను ఒకే వ్యవస్థ కిందికి తీసుకువచ్చేందుకు సంకల్పించింది. ఈ క్రమంలో సీఎం జగన్ (Andhra Pradesh CM YS Jagan) తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ను ప్రారంభించారు.

దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఉపయోగపడుతుందని వెల్లడించారు. పుణ్యక్షేత్రాలు, దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకతతో కూడిన వ్యవస్థలు (Temple Management System) ఉండాలన్నదే తమ అభిమతమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇకపై దేవాలయాల సమాచారం, భక్తులకు అవసరమైన సేవలు, ఆన్ లైన్ సేవలతో పాటు ఆలయాల ఆదాయ వ్యయాలు, సిబ్బంది వివరాలు, ఆలయాల పూర్తి వివరాలు, పండుగ దినాల నిర్వహణ, పర్వదినాలు-ఉత్సవాల క్యాలెండర్, ఆస్తుల నిర్వహణ తదితర అంశాలన్నీ ఇకపై టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ లో భాగం కానున్నాయని వివరించారు.

Here's CMO Andhra Pradesh  Tweet

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... దేవాలయాల్లో అవినీతి కట్టడికి (Transparency of funds) టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఉపయోగపడుతుందన్నారు. పుణ్యక్షేత్రాలు, దేవాలయాల్లో స్వచ్చమైన, పారదర్శకతతో కూడిన సేవలు అందించేందుకే ఈ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇకపై దేవాలయాల సమాచారం, భక్తులకు అవసరమైన సేవలు, ఆన్ లైన్ సేవల వివరాలు,ఆలయాల ఆదాయ వ్యయాలు, సిబ్బంది వివరాలు, పండుగ దినాల నిర్వహణ, పర్వదినాలు-ఉత్సవాల క్యాలెండర్, ఆస్తుల నిర్వహణ తదితర వివరాలన్నీ టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టమ్‌లో అందుబాటులో ఉంటాయన్నారు.

రాజధాని భూ అక్రమాల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ సిఐడి నోటీసులు, విచారణకు హాజరుకావాలని సూచన

ఈ-హుండీ సదుపాయం ద్వారా భక్తులు కానుకలు సమర్పించే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఈభక్తులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఈ-హుండీలో కానుకలు సమర్పించవచ్చు. ఈ ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థను యూబీఐ నిర్వహించనుంది. టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా తొలిసారిగా రాష్ట్రంలోని అన్నవరం ఆలయంలో ఈ-హుండీ విధానం అందుబాటులోకి వచ్చింది. సేవల ప్రారంభోత్సవం సందర్భంగా యూబీఐ రూ.10,116లను కానుకగా చెల్లించింది.

జగన్ పాలనకే ప్రజలు పట్టం, వైసీపీ ఖాతాలోకి 11 కార్పోరేషన్లు, 73 మున్సిపాలిటీల్లో జగన్ సర్కారు విజయకేతనం, రెండు స్థానాలతో సరిపెట్టుకున్న టీడీపీ, ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి

ఈ నెలాఖరు నాటికి 11 ప్రధాన దేవాలయాలల్లో ఈ హుండీ విధానం అందుబాటులోకి రానుంది. తద్వారా భక్తులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి హుండీ చెల్లింపులు చేయవచ్చు. టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ లాంచ్ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్,ఎండోమెంట్ కమిషనర్ అర్జునరావు,యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ అండ్ సీఈవో కిరణ్ రాయ్,ఎస్ఎల్‌బీసీ కన్వీనర్ బ్రహ్మానంద రెడ్డి తదితరలు పాల్గొన్నారు.