CM-YS-jagan-Review-Meeting

Amaravati, June 13: వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంతి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష(CM YS Jagan reviews) చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు, ఆరోగ్యశ్రీ, దాని కింద కార్యక్రమాలు, వైద్య ఆరోగ్యశాఖలో నాడు – నేడు కింద చేపడుతున్న పనులు, కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్‌ కేర్‌ తదితర అంశాలపై (Medical and health dept) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏ తరహా ప్రసవం జరిగినా తల్లికి రూ.5వేలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

ఏ తరహా ప్రసవం జరిగినా ఆరోగ్య ఆసరా కింద తల్లికి రూ.5 వేలు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సహజ ప్రసవం అయినా, సిజేరియన్ అయినా ఆరోగ్య ఆసరా వర్తింపజేయాలని స్పష్టం చేశారు. అయితే సహజ ప్రసవాల సంఖ్య పెంచాలని, ఈ దిశగా అవగాహన, చైతన్యం పెంచాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కిందకు మరిన్ని చికిత్సలు తీసుకురావాలని నిర్దేశించారు. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ, ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 2,446 రకాల చికిత్సలు అమల్లో ఉన్నాయని సీఎంకు వివరించారు. ఆరోగ్యశ్రీ కార్యకలాపాల కోసం ఏడాదికి దాదాపు రూ.4 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు, గత సంవత్సరం ఆయుష్మాన్ భారత్ కింద ఏపీకి రూ.223 కోట్లు వచ్చాయని, ఈ సంవత్సరం రూ.360 కోట్లు రావొచ్చని పేర్కొన్నారు.

మరో 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం, విస్తారంగా వర్షాలు పడే అవకాశం, తొలకరి కోసం ఎదురు చూస్తున్న రైతులు, ఇంకా పలు జిల్లాల్లో మండుతున్న ఎండలు...

నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకి డబ్బు, అక్కడ నుంచి ఆస్పత్రికి ఆటోడెబిట్‌లో చెల్లింపులు, ఎవ్వరికీ అసౌకర్యం కలగకుండా ఈ ప్రక్రియ కొనసాగాలి. ముందుగా పేషెంటు డిశ్చార్జి అయ్యే సమయంలో కన్సెంటు ఫారం స్వీకరణ, పేషెంటు, బ్యాంకు, ఆస్పత్రి మధ్య కన్సెంటుతో కూడిన ఫారం ఇవ్వాలి. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఈ విధానంలో చాలా వరకు పొరపాట్లను నివారించే అవకాశం ఉంటుందని సీఎం జగన్‌ తెలిపారు.

రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నంలలో కొత్త మెడికల్‌ కాలేజీల్లో 2023 నుంచి మెడికల్‌ ప్రవేశాల కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. మెడికల్‌ కౌన్సిల్‌ మార్గదర్శకాల ప్రకారం చేయాల్సిన పనులు వేగంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఇక్కడ డిసెంబర్‌ నాటికి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మిగిలిన చోట్ల కూడా నిర్మాణాలు వేగవంతం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఒకటి రెండు చోట్ల స్థలాలపై కోర్టు కేసులున్నాయని అధికారులు తెలుపడంతో.. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేయాలని సీఎం జగన్‌ సూచించారు.

తిరుమలలో రికార్డు స్థాయిలో టీటీడీ హుండీ ఆదాయం, మే నెలలో రూ.130.29 కోట్లు వచ్చిందని తెలిపిన టీటీడీ, ఆగస్టు 7 న టీటీడీ ఉచిత సాముహిక వివాహాలు

భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. 2020లో ఏపీలో 34వేల మంది క్యాన్సర్‌ కారణంగా మృతి చెందారు. ప్రాథమిక దశలో గుర్తించకపోవడం వల్ల చాలా మంది మరణిస్తున్నారని అధికారులు తెలిపారు. చివరిదశలో గుర్తించి, చికిత్సకోసం భారీగా ఖర్చు చేస్తున్నారని అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతుందని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయిలోనే క్యాన్సర్‌ గుర్తింపుపై దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

అందుకోసం విలేజ్‌ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, పీహెచ్‌సీలను వీలైనంత త్వరగా పూర్తిచేసుకోవాలని సీఎం సూచించారు. డిసెంబర్‌ కల్లా వీటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇవి పూర్తి అయితే ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ విధానం సమర్థవంతంగా అమలు జరుగుతుంది, క్యాన్సర్‌ గుర్తింపు అన్నది సులభంగా జరుగుతుందని సీఎం జగన్‌ తెలిపారు. ఈలోగా సిబ్బందికి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌పై శిక్షణ ఇప్పించాలని సూచించారు. దీని వల్ల క్యాన్సర్‌ గుర్తింపు నుంచి చికిత్స వరకూ సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పడుతుందని సీఎం జగన్‌ తెలిపారు.

దీంతోపాటు స్విమ్స్‌ ఆస్పత్రిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసే 16 మెడికల్‌ కాలేజీలతో కలిపి 27 మెడికల్‌ కాలేజీల్లో కూడా క్యాన్సర్‌ నివారణకు రెండేసి చొప్పున లైనాక్‌ మెషిన్లు ఉండేలా బ్లూ ప్రింట్‌ ఇవ్వాలని సీఎం చెప్పారు. ఇందులో మూడు కాలేజీల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ, తిరుపతి, గుంటూరులో క్యాన్సర్‌ నివారణపై సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ పెట్టాలని ప్రతిపాదించారు. పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధంచేసి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.