తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓటు వేయడానికి వెళ్లిన సమయంలో ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. దీనిపై తాజాగా ఎమ్మెల్యే శివకుమార్ స్పందించారు. ఓటరును అనవసరంగా కొట్టానంటూ మీడియా రాస్తున్న రాతల్ని, ప్రచారాన్ని ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి తనను వ్యక్తిగతంగా దుర్భాషలాడానని, అందుకే ఆ గొడవ జరిగిందని ఆయన తెలియజేశారు. వీడియో ఇదిగో, ఓటరు చెంప చెళ్లుమనిపించిన తెనాలి వైసీపీ ఎమ్మెల్యే, ఎదురు తిరిగి ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన ఓటరు
‘‘ఐతానగర్‌లో నేను నా భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లాం. ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి నన్ను నానా దుర్భాషలాడాడు. వైఎస్సార్‌సీపీపై ద్వేషంతో రగిలిపోతూ.. నా భార్య ముందే నన్ను తిట్టాడు. పోలింగ్ బూత్‌లోకి వెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడూ దుర్భాషలాడుతూనే ఉన్నాడు. గొట్టిముక్కల సుధాకర్ బెంగళూరులో ఉంటున్నారు. టీడీపీకి చెందిన కమ్మ సామాజిక వర్గం వ్యక్తి. ‘‘నువ్వు అసలు కమ్మొడివేనా? అంటూ నన్ను దూషించాడు. బ్లూ షర్టుతో ఓటేయడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, సోషల్ మీడియాలో ఖుషీ అవుతున్న వైసీపీ ఫ్యాన్స్, వీడియోలు ఇవిగో..
‘‘పోలింగ్ బూత్ వద్ద మద్యం మత్తులో అందరి ముందు చాలా దురుసుగా ప్రవర్తించారు. పోలింగ్ బూత్‌లో ఉదయం నుండి అతడు హల్‌చల్ చేస్తున్నట్లు అక్కడి ఓటర్లే చెప్పారు. టీడీపీ జనసేన వాళ్లు ఎక్కడెక్కడి నుండో వాళ్ల మనుషులను దింపారు. వాళ్ల ద్వారా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారు అని శివకుమార్ ఆరోపించారు.
Here's MLA Statement
ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావ్… నువ్వు అసలు కమ్మోడివేనా అంటూ @JaiTDP కార్యకర్త అసభ్యంగా మాట్లాడాడు. అందుకే బుద్ధి చెప్పాల్సి వచ్చింది.
-తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్#TDPLosing#YSRCPWinning#YSJaganAgain#VoteForFan pic.twitter.com/obUYCAhgrd
— YSR Congress Party (@YSRCParty) May 13, 2024
Here's Victim Statement
తెనాలి ఎమ్మెల్యే చేతిలో దెబ్బలు తిన్న బాధితుడు ఏం చెబుతున్నాడో ఓ సారి వినండి.. ఎమ్మెల్యే అయితే ఏంటి.. ప్రతి ఒక్కరూ పద్ధతి ఫాలో కావాలి#TenaliMLA #Tenali #APElections2024 #AndhraPradeshElection2024 #bignews #ElectionCommissionOfIndia #chotanews pic.twitter.com/KRtNCMRkUs
— ChotaNews (@ChotaNewsTelugu) May 13, 2024
ఈ ఘటనపై ఈసీ సీరియస్ అయింది. ఎమ్మెల్యేపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ను గృహ నిర్బంధంలో ఉంచాలని తన ఆదేశాల్లో పేర్కొంది.