AP Govt to Announce MSP to Farmers: రైతులకు జగన్ సర్కారు మరో శుభవార్త, అక్టోబర్‌ 1వ తేదీన కనీస గిట్టుబాటు ధర ప్రకటన, ధరలతో కూడిన పోస్టర్‌ను విడుదల చేయనున్న ఏపీ సీఎం వైయస్ జగన్
IPS Officers Transfers And Promotions In Andhra Pradesh (photo-Twitter)

Amaravati, Sep 30: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశ వ్యాప్తంగా నిరసనలు రేకెత్తుతున్న వేళ ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రైతులకు తీపి కబురును అందించింది.ఇందులో భాగంగా ఏ పంటకు ఎంత కనీస గిట్టుబాటు ధర (AP Govt to Announce MSP to Farmers) అనేది అక్టోబర్‌ 1వ తేదీన ప్రకటించబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఆ ధరలతో కూడిన పోస్టర్‌ను (MSP for all crops) అక్టోబర్‌ 5వ తేదీ నాటికి అన్ని రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకేలు) వద్ద ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు.

ఆ ధరల కన్నా ఇంకా ఎక్కువే రైతులకు వచ్చేలా చూడాలని, అలా జరగకపోతే మార్కెట్‌ జోక్యంతో రైతులకు మేలు చేయాలని సూచించారు. సీఎం–యాప్‌ (సీఎం–ఏపీపీ) అమలయ్యేలా జేసీలు చూడాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ధాన్యం సేకరణ సన్నద్ధతపై మంగళవారం ఆయన (AP CM YS Jagan) తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు, సూచనలు చేశారు.

ఏపీలో అక్టోబర్ నెల‌లో రానున్న పథకాలు, స్పందన కార్యక్రమంపై అధికారులతో ఏపీ సీఎం వైయస్ జగన్ వీడియో కాన్పరెన్స్‌, కలెక్టర్లకు పలు సూచనలు

గ్రామ సచివాలయాల్లోనే ఈ–క్రాపింగ్‌ జరగాలి. ఖరీఫ్‌ పంట చేతికి వస్తోంది. అంటే ధాన్యం సేకరణ ప్రక్రియ మొదలు కానుంది. ఈ ప్రక్రియలో ఆర్బీకేలు ప్రధాన పాత్ర పోషించాలి. ఈ–క్రాపింగ్‌ పక్కాగా పూర్తి కావాలి. ఎక్కడా అది పెండింగ్‌ ఉండకూడదు. కాబట్టి కలెక్టర్లతో పాటు, ఆర్బీకేల ఇన్‌చార్జ్‌లుగా ఉన్న జేసీలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ–క్రాపింగ్‌ వివరాలను సచివాలయాల్లో ప్రదర్శించాలి. ఎక్కడైనా రైతులు మిస్‌ అయితే, వారి పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఈ–క్రాపింగ్‌ ఉంటేనే, పంటల బీమా ప్రీమియమ్‌ చెల్లింపు, పంటల అమ్మకం, గిట్టుబాటు ధర కల్పన వంటివి సాధ్యం. అందువల్ల గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) ప్రత్యేక శ్రద్ధ చూపి, ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ సీఎం కోరారు.

ఏపీలో స్కూళ్ల రీ ఓపెనింగ్ తేదీ వాయిదా, నవంబర్‌ 2న స్కూళ్లు తెరుస్తామని తెలిపిన ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

ప్రతి ఆర్బీకే వద్ద మల్టీపర్పస్‌ సదుపాయాల కేంద్రం (ఎంపీఎఫ్‌సీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పంటల సాగుకు ముందు, ఆ తర్వాత రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఆ కేంద్రం పని చేస్తుంది. గోదాము, కోల్డ్‌ రూమ్, కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రం, ప్రైమరీ ప్రాసెసింగ్‌ (గ్రేడింగ్‌ అండ్‌ సార్టింగ్‌), ధాన్యం సేకరణ, జనతా బజార్, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్, ఆక్వాకు మౌలిక సదుపాయాల కల్పన, ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వంటి అన్నింటి కోసం ఆ కేంద్రాలు పని చేస్తాయి.

మా భూములకు నష్టపరిహారం ఇవ్వలేదు, ఏపీ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన సినీ నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్‌

ఆ కేంద్రాల కోసం ప్రతి ఆర్బీకే వద్ద భూమిని కలెక్టర్లు వచ్చే 15 రోజుల్లో సేకరించి, వ్యవసాయ శాఖకు అప్పగించాలి. సదుపాయాల కల్పన కోసం వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రూ.6,300 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఆ ప్రక్రియలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సం«ఘాలు (ప్యాక్స్‌) కూడా భాగస్వామ్యం వహిస్తాయి. కాబట్టి వచ్చే వారం రోజుల్లో అవి (ప్యాక్స్‌) తమ నివేదికలను ఆప్కాబ్‌కు అందజేయాలని తెలిపారు.