CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, June 5: కోవిడ్‌ బాధితులకు అలుపెరగని సేవలందించి కరోనా బారిన పడి తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న కారంచేడు పీహెచ్‌సీ వైద్యాధికారి ఎన్.భాస్కరరావు (PHC Medical Officer N. Bhaskara Rao) చికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కరోనాతో (Coronavirus) పూర్తిగా పాడైపోయిన ఊపిరితిత్తులు మార్చాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో వైద్యుడు భాస్కరరావు చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తులను మార్చేందుకు కోటిన్నర వరకూ ఖర్చు అయ్యే అవకాశం ఉంది.

దీంతో ఆర్థిక స్తోమత లేని వైద్యుడి కుటుంబసభ్యులు... మంత్రి బాలినేనిని ఆశ్రయించారు. బాలినేని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి అతడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.కోటి వెంటనే చెల్లించాలని, అవసరమైతే మరో రూ.50 లక్షలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారని మంత్రి బాలినేని తెలిపారు.

ఆ వేరియంటే భారత్ కొంప ముంచింది, గత రెండు నెలల్లో పెరిగిన కేసులకు బి.1.617 వేరియంటే కారణమని తేల్చిన ఇన్సాకాగ్‌, ఆంక్షలు తొలగిస్తే కరోనా మూడో వేవ్ ప్రమాదకరంగా మారుతుందని తెలిపిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపుట్టుగకు చెందిన డాక్టర్‌ ఎన్‌.భాస్కరరావు ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీ వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలతో సుమారు 6 వేల మందికి కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా తేలిన వారెందరికో అండగా నిలబడ్డారు. ఆయన అందించిన వైద్యంతో వేలాది మంది కోవిడ్‌ బారినుంచి బయటపడ్డారు. ఏప్రిల్‌ 24న ఆయనకు కరోనా సోకింది. నెలాఖరు వరకు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి వైద్యం పొందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో భార్య డాక్టర్‌ భాగ్యలక్ష్మి ఆయనను విజయవాడ ఆయుష్‌ ఆస్పత్రిలో చేర్చారు.

అదుపులోకి వచ్చిన సెకండ్ వేవ్, వణికించేందుకు రెడీ అవుతున్న థర్డ్ వేవ్, గత 24 గంటల్లో 1,20,529 మందికి కరోనా, 1,97,894 మంది డిశ్చార్జ్, మహారాష్ట్రలో ఐదు విడతల్లో అన్ లాక్ ప్రక్రియ షురూ

అక్కడ 10 రోజుల వైద్యం తరువాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ యశోదా హాస్పిటల్, తరువాత గచ్చిబౌలిలోని కేర్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందారు. ఊపిరితిత్తులు పూర్తిగా పాడవటంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతుండటంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు.