AP High Court: అమూల్‌ ఒప్పందంతో మీకేం పని, రఘురామను ప్రశ్నించిన ఏపీ హైకోర్టు, పూర్తి స్థాయిలో విచారణ జరుపతామని వెల్లడి, రుణఒప్పందాలపై వేసిన మరో పిల్‌పై విచారణ నవంబర్ 15కు వాయిదా
HIGH COURT OF ANDHRA PRADESH| (Photo-Twitter)

Amaravati, Oct 22: ఏపీడీడీసీఎఫ్‌ ఆస్తులను అమూల్ కి లీజుకిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్ పై హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. ఈ విచారణలో న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌ మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీడీడీసీఎఫ్‌) ఆస్తులను గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌కు లీజుకిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏమిటని హైకోర్టు గురువారం ఎంపీ రఘురామకృష్ణరాజును (rama krishna raju plea) ప్రశ్నించింది.

అమూల్‌ విషయంలో ప్రభుత్వ నిర్ణయం వల్ల మీరే విధంగా నష్టపోతారని నిలదీసింది. ఫలానా విధంగానే ప్రభుత్వం వ్యవహరించాలని ఎలా శాసిస్తారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని తెలి పింది. తదుపరి విచారణను నవంబర్‌ 29కి వాయిదా వేసింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులను అప్పటివరకు పొడిగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి, 14 రోజుల రిమాండ్ విధించిన మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు, బెయిల్‌పై ఉన్నా ఆంక్షలు పాటించలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టులో వాదనలు

ఇక ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ (ఏపీఎస్డీసీ) ఏర్పాటు, రుణాలు పొందుతున్న వ్యవహారంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. పన్నుల రూపంలో వస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ లో జమ చేయకుండా నేరుగా ఏపీఎస్‌డీసీకి మళ్లించడం సరికాదని వ్యాఖ్యానించింది. నిధుల బదిలీకి సంబంధించిన రికార్డులను కోర్టు ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

ఏపీఎస్‌డీసీ ద్వారా బ్యాంకుల నుంచి రూ. 25 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరును వ్యక్తిగతంగా ఎలా చేరుస్తారని ప్రశ్నించింది.గవర్నర్ పేరుతో చేసుకున్న ఇలాంటి ఒప్పందం చెల్లకుండా పోయే అవకాశం ఉందని తెలిపింది. దావాలు, క్రిమినెల్ కేసులు నమోదు నుంచి అధికరణ 361 ప్రకారం గవర్నర్ కు రక్షణ ఉన్నట్లు గుర్తు చేసింది. ఒప్పందం ద్వారా ఆయనకు ఉన్న సార్వభౌమాధికారాన్ని తొలగించడం సరికాదని పేర్కొంది. రాజకీయ నాయకులు దాఖలు చేస్తున్న ప్రజాహిత వ్యాజ్యాలను తాము నిలువరించలేమంది, ఏ పార్టీల నేతలు వ్యాజ్యాలు వేశారనే అంశంతో తమకు సంబంధం లేదని అందులోని అంశాలను పరిగణలోకి తీసుకుని విచారణ చేస్తామని తెలిపింది. అనంతరం విచారణను నవంబర్ 15కు వాయిదా వేసింది.

రైతులకు జగన్ సర్కారు మరో శుభవార్త, అక్టోబర్ 26న రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల, జగనన్న శాశ్వత గృహహక్కు పథకంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్

కాగా పన్నుల ద్వారా వస్తున్నప్రభుత్వ ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ లో జమ చేయకుండా నేరుగా ఏపీఎస్‌డీసీకి మళ్లిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామ కృష్ణ బాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అలాగే ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ చట్టం 2020లోని సెక్షన్ 3(3),4లను రద్దు చేయాలని విజయవాడకు చెందిన హిమబిందు మరో పిల్ దాఖలు చేశారు. దీంతో పాటు ఎస్క్రో ఒప్పందాన్ని సవాల్ చేస్తూ తెనాలికి చెందిన ఎం వెంకట్ గ్రీష్మ కుమార్ మరో పిల్ వేశారు.