Corona in AP: థర్డ్ వేవ్ అలర్ట్, ఏపీలో భారీగా కోవిడ్‌ మందులు రెడీ చేసిన ప్రభుత్వం, రాష్ట్రంలో తాజాగా 1,248 కరోనా కేసులు, ప్రస్తుతం రాష్ట్రంలో 13,677 యాక్టివ్‌ కేసులు
Medical workers (Photo Credits: IANS)

Amaravati, August 24: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 58,890 పరీక్షలు నిర్వహించగా.. 1,248 కేసులు (Corona in AP) నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,04,590 (Coronavirus in Andhra Pradesh) మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,750కి చేరింది.

24 గంటల వ్యవధిలో 1,715 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,77,163కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,677 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,61,98,824 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్‌ తీవ్రత తగ్గినా.. సెకండ్‌ వేవ్‌ ఇంకా కొనసాగుతూనే ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు మూడో వేవ్‌ వస్తుందనే అంచనాలు ఉన్నాయని చెబుతున్నారు. భవిష్యత్‌ అంచనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా ముందస్తు చర్యలు చేపట్టింది. థర్డ్‌ వేవ్‌ తీవ్రంగా వచ్చినా సమర్థంగా ఎదుర్కొని రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. అవసరమైన భారీఎత్తున మందుల నిల్వల్ని సిద్ధం చేసింది.

నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు, రుతుపవన ద్రోణి ప్రభావం వల్ల పలు రాష్ట్రాల్లో ఈ నెల 28 వరకు వరకు వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో విరుచుకుపడిన సెకండ్‌ వేవ్‌లో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల కోసం ఎంతగా ఇబ్బంది పడింది అందరికీ తెలిసిందే. ఒక్కో ఇంజెక్షన్‌ ధర రూ.4 వేలు కాగా.. బ్లాక్‌ మార్కెట్‌లో కొంతమంది రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ అమ్ముకున్నారు. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే భారీగా నిల్వలు ఉంచింది. మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ (మ్యుకర్‌ మైకోసిస్‌) మందుల విషయంలో భవిష్యత్‌లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. కోవిడ్‌కు సంబంధించిన అన్నిరకాల మందులను భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా స్టాకు పెంచారు.

వాట్సాప్‌‌ ద్వారా కరోనా వ్యాక్సినేషన్ స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, ఏ నంబర్ ద్వారా వ్యాక్సిన్‌ బుకింగ్‌ చేయాలో తెలుసుకోండి

13 లక్షలకు పైగా హోం ఐసొలేషన్‌ కిట్లు

ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకునే వారి కోసం 13 లక్షలకు పైగా హోం ఐసొలేషన్‌ కిట్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఒక్కో జిల్లాలో సగటున లక్ష కిట్లను రెడీగా ఉంచింది. మరోవైపు ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన యుద్ధప్రాతిపదికన కొనసాగుతూనే ఉంది.

కండోమ్ లేదని పురుషాంగానికి సీల్ వేసుకుని సెక్స్, తరువాత చెట్ల పొదల్లో అపస్మారకంగా పడిన యువకుడు, చికిత్స పొందుతూ మృతి, గుజరాత్ అహ్మదాబాద్‌లో ఘటన

పడకలు, ఆక్సిజన్‌ పైప్‌లైన్లు, ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు వంటివన్నీ భారీగా సిద్ధం చేస్తోంది. కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ లో చేర్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే. అత్యంత ఖరీదైన బ్లాక్‌ఫంగస్‌ జబ్బునూ ఆరోగ్యశ్రీలో చేర్చి వేలాది రోగులకు ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం చేయగలిగింది.