Corona in AP: ఏపీలో 20 వేల దిగువకు చేరిన యాక్టివ్ కేసులు, తాజాగా 1,413 మందికి కరోనా పాజిటివ్, కొత్తగా 1,795 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి, దేశంలో 50 కోట్ల మందికి వ్యాక్సిన్‌ పూర్తి చేశామని తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
Coronavirus outbreak | (Photo Credits: IANS)

Amaravati, August 9: ఏపీలో గడిచిన 24 గంటల్లో 54,455 నమూనాలను పరీక్షించగా 1,413 మందికి పాజిటివ్‌గా (Corona in AP) నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,83,721కి చేరింది. తాజాగా 18 మంది కరోనా మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 13,549కి పెరిగింది. మరోవైపు 1,795 మంది కరోనా (Coronavirus) నుంచి కోలుకొని డిశ్ఛార్జి కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 19,549 క్రియాశీల కేసులు (Active Cases) ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ మేరకు బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,52,47,884 నమూనాలను పరీక్షించినట్లు అందులో పేర్కొంది. తాజాగా చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

జూలై నాటికి దేశంలో లక్ష్యానికి మించి వ్యాక్సినేషన్‌ (Vaccination) పూర్తిచేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. విశాఖ పట్నంలోని చినవాల్తేరు పట్టణ ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను నిన్న ఆమె పరిశీలించారు. అనంతరం నర్సీపట్నం నియోజకవర్గం కేడీ పేటలో విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు సమాధి వద్ద పూలమాలలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అక్కడ నుంచి కశింకోట మండలం తాళ్లపాలెంలో పీడీఎస్‌ కేంద్రాన్ని తనిఖీ చేశారు.

ఏపీలో మూడు రాజధానులపై సందేహం లేదు, ఏర్పాటు ఖాయం, అమరావతి ఉద్యమం పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తామని తెలిపిన మంత్రి కురసాల కన్నబాబు

ప్రధానమంత్రి గరీబ్‌కళ్యాణ్‌ అన్న యోజన ఉచిత బియ్యం పథకం కింద లబ్ధిదారులందరికీ సక్రమంగా అందజేయాలని అధికారులను ఆదేశించారు. రేషన్‌ డీలర్‌ను పంపిణీ వ్యవస్థపై వివరాలడిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు సుమారు 50 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు చెప్పారు. ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి అయ్యే వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తోందని తెలిపారు.

ఏపీలో ఈ నెల‌ 16 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు 16 నుంచి రెగ్యులర్ క్లాసులు, ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్ బోర్డు

రానున్న రెండునెలల్లో వ్యాక్సిన్ల సరఫరా పెరుగుతుందన్నారు. దేశీయంగా సరఫరా పెంచడంతోపాటు విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌ వివరాలను కలెక్టర్‌ ఎ.మల్లికార్జున మంత్రికి వివరించారు. రాష్ట్రంలో 2.36 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేశారని, వారిలో 1.74 కోట్ల మందికి మొదటిడోస్, మిగిలినవారికి రెండు డోస్‌లు వేసినట్లు చెప్పారు. జిల్లాలో 22 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయగా అందులో 17 లక్షల మందికి మొదటిడోస్, 5 లక్షల మందికి రెండు డోసులు వేసినట్లు తెలిపారు.