Amaravati, June 23: ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 80,712 పరీక్షలు నిర్వహించగా.. 4,684 కేసులు నిర్ధారణ (COVID in Andhra Pradesh) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,62,036 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 36 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,452కి చేరింది.
24 గంటల వ్యవధిలో 7,324 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,98,380కి (Covid-19 cases) చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 51,204 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,13,61,014 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరులో ఎనిమిది మంది, తూర్పుగోదావరిలో అయిదుగురు, కృష్ణాలో అయిదుగురు, అనంతపూర్ లో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూల్, ప్రకాశంలో ఇద్దరూ, విశాఖపట్నంలో ఇద్దరూ, కడపలో ఇకరు, గుంటూరు, పశ్చిమగోదావరిలో ఒకరు చనిపోయారు.
Here's Covid Update
#COVIDUpdates: 23/06/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,59,141 పాజిటివ్ కేసు లకు గాను
*17,95,485 మంది డిశ్చార్జ్ కాగా
*12,452 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 51,204#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/ktK5S5af2B
— ArogyaAndhra (@ArogyaAndhra) June 23, 2021
ఆర్టీసీ ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. కోవిడ్ కర్ఫ్యూ సడలింపులు ఇవ్వడంతో బస్ సర్వీసులను అమాంతంగా పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సంస్థలోని డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు రీజనల్ మేనేజర్లతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
మొత్తం 55 వేల మంది ఉద్యోగుల్లో 45 ఏళ్ల దాటినవారు 33 వేల మంది ఉన్నారు. వారిలో 29 వేల మందికి మొదటి డోస్ వ్యాక్సిన్లు వేయగా, కేవలం 6 వేల మందికే రెండు డోసుల వ్యాక్సిన్లు పూర్తయ్యాయి. 45 ఏళ్లు దాటిన ఉద్యోగులందరికీ జూలై 31 నాటికి రెండు డోసుల వ్యాక్సిన్లు పూర్తి చేయాలని ఎండీ స్పష్టం చేశారు. తక్కినవారికి జూలై 31 నాటికి మొదటి డోసు వ్యాక్సిన్లు వేసి, ఆగస్టు 31 నాటికి రెండు డోసులు పూర్తి చేయాలన్నారు.