Amaravati, Sep 13: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 38,746 పరీక్షలు నిర్వహించగా 864 కొవిడ్ కేసులు (Corona in AP) నిర్ధారణయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,30,849 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 12 మంది బాధితులు (Covid Deaths) ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,010కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,310 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 20,02,187 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,652 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,73,63,641 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
కరోనా నుంచి కోలుకున్న వారు కూడా రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని, అప్పుడే వారికి కరోనా నుంచి రక్షణ లభిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తన అధ్యయనంలో... కోవిడ్-18 నుంచి కోలుకున్నవారు కోవ్యాగ్జిన్ ఒక డోసు తీసుకుంటే సరిపోతుందని, తద్వారా వారికి మరోమారు కరోనా సంక్రమించే అవకాశాలు తక్కువ అని తెలిపింది.
అలాగే కరోనా సోకనివారు తప్పని సరిగా రెండు డోసుల టీకా తీసుకోవాలని పేర్కొంది. అయితే ఐసీఎంఆర్ తాజా అధ్యయనంలో కోవిడ్-19 సోకి, వారు ఒక డోసు కోవ్యాగ్జిన్ తీసుకుంటే వారికి కోవిడ్ సోకని వారికున్న స్థాయిలో ఇమ్యూనిటీ సమకూరింది. ఈ విషయాన్ని ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమయ్యింది.