Amaravati, June 9: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 93,511 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,766 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ (Andhra Pradesh logs 8766 new Covid cases) అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 17,76,878 మందికి కరోనా వైరస్ (Covid in Andhra Pradesh) సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 67 మంది (Covid Deaths) మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,696కు చేరింది.
గడిచిన 24 గంటల్లో 12,292 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 16 లక్షల 64 వేల 082 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 1,03,995 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,00,39,764 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
కొత్తగా చిత్తూరు జిల్లాలో 11, తూర్పుగోదావరి జిల్లాలో, విశాఖ జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. ప్రకాశంలో ముగ్గురు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.
కరోనా కట్టడిలో.. వ్యాక్సిన్ పంపిణీలో ఏపీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కరోనా పరీక్షలు ఇప్పటివరకు 2 కోట్ల మందికిపైగా చేసినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఏపీలో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయని చెప్పారు. అమరావతిలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏకే సింఘాల్ మీడియాతో మాట్లాడారు.
AP Covid Report
#COVIDUpdates: 09/06/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 17,76,878 పాజిటివ్ కేసు లకు గాను
*16,61,187 మంది డిశ్చార్జ్ కాగా
*11,696 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,03,995#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/JetLPV4WQk
— ArogyaAndhra (@ArogyaAndhra) June 9, 2021
మే 16వ తేదీన పాజిటివిటీ రేటు 25.56% ఉండగా ప్రస్తుతం 9.37%గా ఉందని, రెట్టింపు స్థాయిలో పాజిటివ్ రేటు తగ్గిందని వివరించారు. ఇప్పటివరకు 1.09 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించారు. జులై 10వ తేదీ నాటికి ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ పూర్తి చేస్తామని ఏకే సింఘాల్ ప్రకటించారు
రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులందరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. ఇప్పటివరకు 45 ఏళ్ల వయసు పైన వారికే వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. కానీ చిన్నారుల్లో కరోనా వచ్చినప్పుడు తల్లి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లులకు కూడా టీకా వేస్తే రక్షణ ఉంటుందని చెప్పారు.