Andhra Pradesh Partial curfew (Photo: PTI)

Amaravati, May 5: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నేటి నుంచి కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. నేటి నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ (Andhra Pradesh Partial curfew) అమలు కానుంది.. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి త‌ర్వాతి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు ఈ క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంది. కాగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే షాపులకు అనుమతి ఉంటుంది.

కర్ఫ్యూ ఈనెల 18 వరకు కొనసాగనుంది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ప్రకటించింది. కర్ఫ్యూకు (Andhra Pradesh imposes curfew) ప్రజలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కర్ఫ్యూ నుంచి కొన్నింటికి సవరణలు (AP Curfew Exemptions) ప్రకటించింది.

ఈ మినహాయింపుల ప్రకారం..రాష్ట్రంలో బ్యాంక్‌ సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి. అన్నిరకాల బ్యాంక్ సేవలకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. అలాగే జాతీయ రహదారుల పనులు కొనసాగించేందుకు అనుమతి ఉంది.పోర్టుల్లో కార్యకలాపాల నిర్వహణకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఈ మేరకు సవరణ ఉత్తర్వులను జారీ చేశారు.

జూన్ 1 నుంచి జగనన్న కాలనీ పనులు, కర్ఫ్యూ ఉన్నా పనులు ఆగకూడదని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, ప్రతి లేఅవుట్‌లో తప్పనిసరిగా ఒక మోడల్‌ హౌజ్‌ నిర్మించాలని అధికారులకు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ కారణంగా ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ సదుపాయాన్ని రద్దు చేసింది. దూరప్రాంతాలకు నడిచే అన్ని బస్సు సర్వీసుల రిజర్వేషన్లను రద్దు చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 18 వరకూ ముందస్తు రిజర్వేషన్లను నిలిపివేసింది. బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులకు అనుగుణంగా అప్పటికప్పుడు బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. జగ్గయ్యపేట చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేయనున్నారు. సరైన కారణం ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి ఉంటుందని...లేదంటే వెనక్కి పంపించాలని అధికారులు ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి మధ్యాహ్నం 12 తర్వాత రాష్ట్ర సరిహద్దులను మూసివేయనున్నారు

తెలంగాణ నుంచి ఏపీకి బస్సులు బంద్, వస్తే మధ్యాహ్నం 12 గంటల్లోపే గమ్యం చేరాలి, నేటి నుంచి ఏపీలో 18 గంట‌ల కర్ఫ్యూ అమల్లోకి, కర్ప్యూ నుంచి మినహాయింపు పొందేవి ఏవో ఓ సారి తెలుసుకోండి

కర్ఫ్యూను అతిక్రమించి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. గుమిగూడడం, సమావేశాలు నిర్వహించడం వంటి వి పూర్తిగా నిషేధం. ఉదయం 6 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకూ 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. ఆ తరువాత కర్ఫ్యూ అమలవుతుంది. ఆ సమయంలో ఆటోలు, ఆర్టీసీ బస్సుల రాకపోకలపై కూడా నిషేధం ఉంది. 12 గంటల తరువాత ఆటోలు రోడ్ల పైకి వస్తే సీజ్‌ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

మీడియా వంటి అత్యవసర ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. ఉదయం పూట షాపులు తెరిచే సమయంలో వాహనాల రాకపోకలకు అనుమతి ఉంది. ఆ సమయంలో గుంపులు గుంపులుగా షాపింగ్‌లు చేయకూడదు. ఈ ఆంక్షలు రెండు వారాల పాటు కొనసాగుతాయి.