‘Chalo Vijayawada’ Programme: విజయవాడలో టెన్సన్, చలో విజయవాడకు తరలివచ్చిన ఉద్యోగులు, సమ్మెకు దూరమని తెలిపిన ఆర్టీసీ సంఘాలు, ఉద్యోగుల ఆందోళనపై స్పందించిన హోంమంత్రి సుచరిత
Chalo Vijayawada Programme (photo-Twitter)

Vijayawada, Feb 3: పీఆర్సీ సాధన సమితి తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో విజయవాడలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా కొనసాగుతోంది. తమను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా తాము తగ్గేదే లే అన్న ఉద్యోగులు చెప్పిన విధంగానే విజయవాడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. విజయవాడకు వచ్చే రోడ్లపై ఎన్నో చెక్ పోస్టులు పెట్టి ఉద్యోగులను అడ్డుకున్నా, నగరానికి వస్తున్న వాహనాలను తనిఖీలు చేసినా... వేలాది మంది ఉద్యోగులు పోలీసుల కళ్లుకప్పి నగరంలోకి ప్రవేశించారు.

ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. మహిళా ఉద్యోగులు సైతం పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొంటున్నారు. మరోవైపు నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు (Police deploy forces to prevent ‘Chalo Vijayawada) విశ్వప్రయత్నం చేస్తున్నారు. వారిని దాటుకుంటూనే ఉద్యోగులు ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేస్తున్నారు. 'సీఎం డౌన్ డౌన్, నల్ల జీవోలు వెనక్కి తీసుకోవాలి, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, వీ వాంట్ జస్టిస్, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి' అంటూ వారు నినదిస్తున్నారు.

ఏపీలో 100శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి, ప్రస్తుతం మనం కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌లో ఉన్నామని తెలిపిన ఏపీ సీఎం జగన్

శ్రీకాకుళం నుంచి వచ్చిన ఉద్యోగులు శారద కళాశాల సమీపంలో బీఆర్టీఎస్‌కు చేరుకున్నారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులకు చిక్కకుండా శారదా కాలేజీ సమీపంలోని శివరామయ్య క్షేత్రానికి చేరుకున్నారు. తాము బీఆర్టీఎస్‌కు చేరుకున్నామని తమను ఎవ్వరు అడ్డుకోలేరని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చీకటి జీవోలను రద్దు చేసి నివేదిక ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఉద్యోగులు తలపెట్టిన ఛలో విజయవాడకు ఎటువంటి అనుమతులు లేవంటూ విజయవాడకు చేరుకుంటున్న ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.

Here's ‘Chalo Vijayawada’ Programme Updates

విజయవాడలో (Chalo Vijayawada) టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బీఆర్టీఎస్ రోడ్డు మీద పోలీసులు భారీగా మోహరించారు. ఫాల్కన్ వాహనంతో చుట్టుపక్కల పరిస్ధితులను అనుక్షణం పరిశీలిస్తున్నారు. బీఆర్టీఎస్ రోడ్డు చుట్టుపక్కల అన్నివైపులా పికెట్లు ఏర్పాటు చేశారు. మరో నాలుగు పాయింట్ల వద్ద భద్రత అదనంగా ఏర్పాటు చేశారు. బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం నడిచి పోలీసులు తిరుగుతున్నారు. బందోబస్తు ఏర్పాట్లను సీపీ క్రాంతిరాణా టాటా క్షేత్ర స్ధాయిలో పరిశీలించారు. గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 200 మంది ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమని వెంటనే విడుదల చేయాలంటూ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగులు నినాదాలు చేశారు. విజయవాడ నగరం వెలుపలే వేలాది మంది ఉద్యోగులను పోలీసులు నిలిపివేశారు. అయినా విజయవాడలో ఉద్యోగులు ఇసుకేస్తే రాలనంతగా తరలి వచ్చారు

ఉద్యోగుల ఆందోళనపై స్పందించిన హోంమంత్రి సుచరిత

ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళనపై హోంమంత్రి సుచరిత స్పందించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని... చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనడం అబద్ధమని అన్నారు. ఉద్యోగులు సహకరించాలని సీఎం కూడా చెప్పారన్నారు. చర్చలకు కమిటీ కూడా వేశామని తెలిపారు. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ఉద్యోహల హౌస్ అరెస్టులు ఏమీలేవన్నారు. అనుమతి లేని సభలకు వెళ్ళవద్దని చెప్పామని తెలిపారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులున్నాయని హోంమంత్రి సుచరిత అన్నారు.

చర్చలు జరుపుదాం: సజ్జల రామకృష్ణారెడ్డి

సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుదామని ఉద్యోగ సంఘాలను ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ఆహ్వానించారు. గురువారం తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని విరమించుకోవాలని (Sajjala warns unions against taking a strident stand) ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ విద్రోహ శక్తులు చొరబడి సమస్యను పక్కదారి పట్టించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉద్యోగులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. పీఆర్సీ వల్ల ఏ ఒక్క ఉద్యోగి వేతనమూ తగ్గలేదన్నారు. ఉద్యమాలతో ఉద్యోగులకు నష్టం చేయవద్దని కోరారు. ఇప్పటికే ఉద్యోగుల ఖాతాల్లో జమ అయిన జీతాలను పరిశీలించుకుంటే తగ్గాయో పెరిగాయో వారికే అర్థమవుతుందన్నారు.

Here's ‘Chalo Vijayawada’ Programme Updates

ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ మంగళవారం సాయంత్రం, బుధవారం ఉదయం చర్చించినట్లు సజ్జల తెలిపారు. మూడు డిమాండ్లపైనే పట్టుబట్టడం సరి కాదని, మిగతా అంశాల పరిష్కారానికి ముందుకు రావాలని కోరారు. ఆ 3 డిమాండ్లకు కాలం చెల్లిందన్నారు. ఇప్పటికే ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేశామని, మిగతా రెండు డిమాండ్లు నెరవేర్చడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమయ్యే అవకాశం లేదన్నారు. పీఆర్సీ నివేదికను ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు.

జీతం పడకుండా తగ్గిందని మీకెలా తెలుస్తుందని ప్రశ్నించిన హైకోర్టు, ఉద్యోగులకు సీఎం ఏమి చెయ్యగలరో అన్నీ చేస్తారని తెలిపిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ

ఇప్పుడు వెలగపూడి నుంచే పరిపాలన సాగుతోందని, సాంకేతికంగా పాలన ఎక్కడినుంచి జరుగుతుందో అదే ప్రస్తుత రాజధాని అవుతుందని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలనను వికేంద్రీకరించాలని నిర్ణయించామని, అందులో భాగంగానే 3 రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆ నిర్ణయం మేరకు భవిష్యత్తులో రాజధాని మార్పు ఉంటుందన్నారు. బడ్జెట్‌లో కేంద్రం ఏటా రాష్ట్రానికి అన్యాయమే చేస్తోందని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ వల్లే ప్రత్యేక హోదా ఇప్పటికీ సజీవంగా ఉందన్నారు.

సమ్మెకు ఆర్టీసీ దూరం

ఉద్యోగుల సమ్మెకు ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు దూరంగా ఉంటున్నట్లు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవి, కొవూరు ఎజ్రాశాస్త్రిలు ప్రకటించారు. ఈమేరకు తమ సంఘం నిర్ణయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి బుధవారం లిఖితపూర్వకంగా తెలియచేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయంతోపాటు కరోనా కష్ట కాలంలో 55 వేల కుటుంబాలకు ప్రతి నెల జీతాలిచ్చి ఆదుకున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయడం అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లేనని చెప్పారు. ఉద్యోగులు ఎవరూ సమ్మెలో పాల్గొనరాదని సంఘం సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు.