Andhra Pradesh PRC Row: జీతం పడకుండా తగ్గిందని మీకెలా తెలుస్తుందని ప్రశ్నించిన హైకోర్టు, ఉద్యోగులకు సీఎం ఏమి చెయ్యగలరో అన్నీ చేస్తారని తెలిపిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ
AP CS Sameer Sharma (Photo-Video Grab)

Amaravati, Feb 1: మంత్రుల కమిటీతో చర్చలకు హాజరు కాబోమని పట్టుబట్టిన ఉద్యోగ సంఘాలు ఎట్టకేలకు చర్చల్లో పాల్గొన్నారు. ఈ మేరకు మంగళవారం మంత్రుల కమిటీతో పీఆర్‌సీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణలతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు ఈ సమవేశంలో పాల్గొనగా, పీఆర్‌సీ స్టీరింగ్‌ కమిటీ నుంచి వెంకట్రామిరెడ్డి, కె ఆర్ సూర్యనారాయణ, బొప్పరాజు, బండి శ్రీనివాస్ చర్చల్లో పాల్గొన్నారు.

ఉద్యోగులకు సీఎం ఏమి చెయ్యగలరో అన్నీ చేస్తారని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ (AP Govt Chief Secretary Dr Sameer Sharma) అన్నారు. ఈ మేరకు సచివాలయంలో ఆయన మీడియాతో (Dr Sameer Sharma Press Meet) మాట్లాడుతూ.. ఐఆర్‌ ఉన్నా.. ఐఆర్‌ లేకున్నా ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ఎవ్వరికీ జీతం తగ్గకూడదని సీఎం చెప్పారు. గత పీఆర్సీ (Andhra Pradesh PRC Row) నుంచి ఇప్పటి పీఆర్సీ వరకు చూస్తూ ఎక్కువ పెరుగుదల ఉంది. ఐఆర్‌తో కలిపినా పెరుగుదల ఉంది. ఎవ్వరికీ జీతాలు తగ్గలేదు. ఈ రోజు రాత్రికి అందరికీ జీతాలు వచ్చాక తెలుస్తుందని అన్నారు.

ఉద్యోగులు (AP Govt Employees) ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ప్రతి ఏటా 15 శాతం ఆదాయం పెరగాలి. పీఆర్సీకి అదనంగా గ్రాట్యుటీ, హౌసింగ్‌ స్కీమ్‌ వలన అదనపు ప్రయోజనం ఉంది. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగం. ప్రతి పీఆర్సీ అప్పుడు చర్చల కమిటీ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగులు ఏ సమస్య ఉన్నా చర్చించుకుందాం. సమ్మె ఆలోచనను విరమించుకోండి. మనమంతా ఒక కుటుంబం. హెచ్‌ఆర్‌ఏ లాంటివి మాట్లాడుకుందాం రండి. ఉద్యోగులను చర్చలకు రమ్మని కోరుతున్నాను' అని సీఎస్‌ సమీర్‌ అన్నారు.

ఏపీలో ఫిబ్రవరి 14 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు, మాస్క్ లేకపోతే రూ. 100 జరిమానా, కొత్తగా 6,213 మందికి కరోనా, అత్యధికంగా కృష్ణా జిల్లాలో 903 కొత్త కేసులు

ఆర్థికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్‌ మాట్లాడుతూ.. ఆర్థిక శాఖ నుంచి ఉద్యోగులను.. మంత్రులు, అధికారులతో చర్చలకు రమ్మని కోరుతున్నాను. ఉద్యోగులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం. ఒకటో తేదీన జీతాలు వెయ్యడం ప్రభుత్వ బాధ్యత. 3.69లక్షల సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు జీతాలు వేశాము. 1.75 లక్షల ఇతర ఉద్యోగులకు జీతాలు వేశాము. 94,800 ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు జమచేశాము. 3.3 లక్షల మంది పెన్షనర్లకు జమచేశాము. 3,97,564 రెగ్యులర్‌ ఉద్యోగుల జీతాలు కూడా వేశాము. వారికి శాలరీ బ్రేక్‌ అప్‌ కూడా పంపాము. ప్రతి ఉద్యోగి వారి జీతాల పెరుగుదలను తెలుసుకునేలా బ్రేక్‌ అప్‌ ఇచ్చాము అని ఆర్థిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్‌ అన్నారు.

ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం.. మంత్రుల కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్ని జేఏసీ నేతలు చర్చలకు వచ్చారని.. అని అంశాలపై చర్చించామని ఆయన తెలిపారు. ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ లేదన్నారు. ఉద్యోగుల కార్యాచరణను వాయిదా వేయమని కోరామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమకు ఎవరికీ అన్యాయం చేయాలని లేదన్నారు. హైకోర్టు సలహాను ఉద్యోగ సంఘాలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇది పాజిటివ్‌ చర్చగానే తాము భావిస్తున్నామని సజ్జల పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల డిమాండ్లపై మళ్లీ చర్చిస్తామని మంత్రుల కమిటీ తెలిపింది.

కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు, పీఆర్సీ బిల్లులు చెయ్యని అధికారులకు మెమోలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఆర్డినెన్స్‌ జారీ

పీఆర్సీ జీవోను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. జీతం పడకుండా తగ్గినట్లు మీకు ఎలా తెలుసు అని హైకోర్టు ప్రశ్నించింది. ‘సమస్య పరిష్కారం కోసం కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు సమ్మె చేయడం అంటే ధర్మాసనంపై అనవసర ఒత్తిడి కలిగించడమే.. ఉద్యోగుల సమ్మెతో సమస్య పరిష్కారం కాదు’ అని హైకోర్టు పేర్కొంది. కోర్టుకు ఏజీ శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగులు అనవసర భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక్క రూపాయి కూడా తగ్గదన్నారు. అత్యున్నతమైన న్యాయస్థానం భావించినట్లే మేము కూడా కోర్టులో పిటిషన్‌కు సంబంధించిన విచారణ నడుస్తున్నప్పుడు సమ్మె చేయటం ప్రయోజనకరం కాదని భావిస్తున్నామని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌ కోర్టుకు తెలిపారు.