2020 Coronavirus Pandemic in India (photo-Ians)

Amaravati, Nov 4: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 85,364 నమూనాలు పరీక్షించగా 2,745పాజిటివ్‌ కేసులు (AP Corona Report) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,35,953 కు ( Covid-19 cases) చేరింది. కొత్తగా 13 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,757కి (Covid Deaths) చేరింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 2,292మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 84,27,629మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21,878యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కరోనా వాక్సిన్‌ల విషయంలో పలు కంపెనీలు పలు రకాలుగా చెబుతున్నాయి. ఇప్పటికే వచ్చే ఏడాది జనవరి నాటికి తమ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీరం సంస్థ ప్రకటించింది. జనవరి, 2021నాటికి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్‌ అందుబాటులో రానుందని పుణేకు చెందిన సీరం సంస్థ సీఈవో అదార్ పూనావాలా ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాచుకుని ఉన్న కరోనా సెకండ్ వేవ్, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన

తాజాగా హైదరాబాద్‌కు చెందిన భారత్ బయెటెక్ తాను రూపొందిస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ ఫిబ్రవరి, 2021 లోనే లాంచ్‌ చేసే అవకాశం ఉందని సీనియర్ సైంటిస్టు ఒకరు ప్రకటించారు. ఊహించిన సమయానికి కంటే ముందే కరోనావైరస్ వ్యాక్సిన్ కోవాక్సిన్‌ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామని తెలిపారు. తొలి స్వదేశీ వ్యాక్సిన్‌గా భావిస్తున్న కోవాక్సిన్‌ చివరి దశ ట్రయల్స్ దాదాపు 25 వేలమందితో ఈ నెలలో ప్రారంభం కానున్నాయి.

ముగిసిన ఏపీ కేబినెట్, పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం, నవంబర్ 24న జగనన్న చేదోడు పథకం ప్రారంభం, కొత్త ఇసుక పాలసీ విధానం అమల్లోకి..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)తో కలిసి రూపొందిస్తున్న కోవాక్సిన్‌ను 2021 రెండవ త్రైమాసికంలో విడుదల చేయనుందని ఐసీఎంఆర్ రీస‌ర్చ్ మేనేజ్మెంట్‌ హెడ్‌, సీనియర్ శాస్త్రవేత్త, కరోనా వైరస్ టాస్క్‌ ఫోర్స్‌ సభ్యుడు రజనీ కాంత్ వెల్లడించారు. మొదటి, రెండవ దశ ప్రయోగాల్లో టీకా మంచి సామర్థ్యాన్ని చూపించిందన్నారు. అయితే మూడో దశ ప్రయోగాలు కూడా ముగిస్తే తప్ప100 శాతం ఖచ్చి తత్వాన్ని నిర్ధారించలేమన్నారు. మూడో దశ ట్రయల్స్ ముగిసేలోపు కోవాక్సిన్ షాట్లను ప్రజలకు ఇవ్వవచ్చో లేదో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుందని కాంత్ తెలిపారు. అయితే దీన్ని భార‌త్ బ‌యోటెక్ సంస్థ ఇంకా నిర్ధారించలేదు.