2020 Coronavirus Pandemic in India (photo-Ians)

Amaravati, July 15: ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో కేసులు తొలిసారిగా 2 వేల మార్కును (2,000 COVID-19 cases in a single day) దాటాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 2,432 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య (AP Coronavirus Report) 35,451కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. మొత్తం 22,197 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2,412 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో రికార్టు స్థాయిలో 12,17,963 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు, అధ్యయన కమిటీ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం, మార్చి 31వ తేదీలోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని కేబినెట్‌ నిర్ణయం

కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో 20 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 805 మంది డిశ్చార్జి కావడంతో.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 18,378కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,621 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 452 మంది మృతి (Coronavirus deaths) చెందారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు 12 లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటివరకు 11,95,766 టెస్టులు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం బులెటిన్‌ విడుదల చేసింది.

గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 468 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు తర్వాత కర్నూలు జిల్లాలో 403 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి 207, తూర్పు గోదావరి 247, చిత్తూరు 257, శ్రీకాకుళం 178, అనంతపురం 162, విశాఖపట్నం 123, కడప 112, కృష్ణా 108, ప్రకాశం 53, విజయనగరం 49, నెల్లూరు జిల్లాలో 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 22,197 శాంపిల్స్‌ను పరీక్షించగా, 2,412 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

గడచిన 24 గంటల్లో ఏపీలో 44 మంది కరోనా వల్ల మరణించినట్లు ప్రభుత్వం పేర్కొంది. అనంతపురం జిల్లాలో 9 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది, కర్నూలు జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, కడపలో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు, విజయనగరంలో ఒకరు మరణించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఏపీ సీఎం మరో సంచలన నిర్ణయం, కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేల ఆర్థిక సాయం, ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు

కరోనా నియంత్రణ నేపథ్యంలో పోలీసుశాఖలో విధులు నిర్వర్తిస్తున్న దాదాపు 22 మంది ఈ మధ్య కాలంలో కోవిడ్‌–19 బారిన పడి విజయవంతంగా కోలుకున్నారని జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ అన్నారు. మంగళవారం పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో పోలీసు యంత్రాంగంలో విధులు నిర్వర్తిస్తూ కరోనా బారిన పడి కోలుకున్న సిబ్బందిని పిలిపించారు. వారికి డ్రై ఫ్రూట్స్, ఇతర పోషకాహార కిట్లను అందజేశారు.

ఇదిలా ఉంటే గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో బందోబస్తు కోసం వచ్చిన ఏపీఎస్పీకి చెందిన 26 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. విశాఖపట్నం 16వ బెటాలియన్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన 88మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లతో పాటు వారికి వంట చేసి పెట్టే కుక్‌కు కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. పిన్నమనేని సిద్ధార్ధ, నారాయణ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి కానిస్టేబుళ్లకు చికిత్స అందిస్తున్నారు.

అనంతపురం ట్రాఫిక్‌ సీఐగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్‌ (47) కరోనా బారినపడి మంగళవారం మృతి చెందారు. ఈయన కొన్నేళ్లుగా మధుమేహ వ్యాధితో బాధపడుతుండేవారు. ఆరోగ్యం క్షీణించి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా కర్నూలు దాటిన తరువాత పరిస్థితి విషమించింది. దీంతో ఆయనను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

రాజశేఖర్‌ మృతి పట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఉన్నప్పుడు తన సమకాలికుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. సీఐ రాజశేఖర్‌ మృతి పోలీసు శాఖకు తీరని లోటని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.రాజశేఖర్‌ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

తిరుపతి నగరంలో కరోనా పాజిటివ్ కేసులు 20కన్నా ఎక్కువగా ఉన్న 1, 4, 5, 6, 7, 9, 10, 13, 14, 15, 28, 29, 30, 31, 35, 36, 37, 38వ (మొత్తం 18) డివిజన్లలో నేటి నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌‌ను అమలు చేయనున్నారు. ఉదయం 11 గంటల వరకే నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలకు అధికారులు అనుమతిని ఇచ్చారు. మద్యం షాపులకు మాత్రం మినహాయింపునిచ్చారు.