Amaravati, April 28: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 74,681 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,669 మందికి పాజిటివ్ (AP Coronavirus) వచ్చినట్లు తేలింది. కరోనా కారణంగా కొత్తగా 71 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ లో వెల్లడించింది.
మొత్తం ఇప్పటివరకూ 1,62,17,831 కరోనా టెస్టులు (Covid Tests) చేయగా, 10,69,544మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. కాగా సోమవారం 11,434 కరోనా పాజిటివ్ కేసులు రాగా మంగళవారం వాటి సంఖ్య 14,669 కేసుల సంఖ్య పెరగింది.
రాష్ట్రంలో వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కరోనా బాధితుల కోసం 37 వేల వరకు బెడ్స్ పెంచామని చెప్పారు. అవసరానికి తగ్గట్టు ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచినట్లు.. ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన భరోసా ఇచ్చారు.
రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత లేకుండా చూస్తామని చెప్పారు. ఇప్పటివరకు 62 లక్షల మందికిపైగా వ్యాక్సినేషన్ ఇచ్చామని వెల్లడించారు. చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. సంక్షోభ సమయంలోనూ చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా 18ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ నమోదు ప్రక్రియ బుధవారం(ఏప్రిల్ 28) సాయంత్రం 4 గంటల నుంచి స్టార్టయ్యింది. అయితే.. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం పెద్ద ఎత్తున యువత ఒక్కసారిగా కొవిన్ పోర్టల్‌లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించటం వల్ల వెబ్సైట్లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. చాలా మందికి ఈ సమస్యలు తలెత్తడంతో వారంతా సామాజిక మాధ్యమాల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు. నమోదు ప్రక్రియ అందుబాటులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లో ఈ ప్రాబ్లం తలెత్తింది.