AP Coronavirus: ఏపీలో మొత్తం 1903 మంది డిశ్చార్జ్, తాజాగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు, 2719కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
Coronavirus in India (Photo Credits: PTI)

Amaravati, May 26: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Coronavirus) నమోదవగా, ఒకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (Covid 19 in AP) 2719కి చేరింది. ఈ ప్రాణాంతక వైరస్‌తో ఇప్పటివరకు మొత్తం 57 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 759 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 1903 మంది బాధితులు కోలుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి ఈ రోజు కరోనాతో చనిపోయాడు. గత 24 గంటల్లో 55 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రయాణికులతో రద్దీగా మారిన గన్నవరం,విశాఖపట్నం విమానాశ్రయాలు, ప్రయాణికులు రెండు గంటల ముందుగానే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలి

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6535 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 146 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,45,380కి పెరిగింది. ఇందులో 80,722 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 60490 మంది కోలుకున్నారు. కరోనాతో దేశంలో ఇప్పటివరకు 4167 మంది బాధితులు మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు జాబితాలో భారత్‌ పదోస్థానంలో నిలిచింది.  మాస్కోని ముంబై దాటేస్తోందా?, దేశంలో కోవిడ్ 19 ప్రధాన హాట్ స్పాట్ కేంద్రంగా ముంబై, భారత్‌లో 1,45,380 కేసులు నమోదు, 4,167 మంది మృతి

దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 52667 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. వైరస్‌ ప్రభావంతో 1695 మంది మరణించారు. తమిళనాడులో 17082 కరోనా కేసులు, 118 మంది మరణించారు. గుజరాత్‌లో 14468 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 888 మంది చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు 14053 కేసులు నమోదుకాగా, 276 మంది చనిపోయారు. రాజస్థాన్‌లో 7300 పాజిటివ్‌ కేసులు నమోదయ్యావగా, 167 మంది మరణించారు.