AP Chief Minister CM YS Jagan Mohan Reddy | File Photo.

Amarvati, June 11: ఏపీ రాష్ట్ర మంత్రివర్గం (AP State Cabinet Meeting) నేడు భేటి కానుంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్‌లో ఈ మీటింగ్ జరగనుంది. కరోనా (COVID-19) నియంత్రణ చర్యల్లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో భౌతిక దూరం పాటించేలా సీట్లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు మద్యం, ఇసుక అక్రమాల నియంత్రణకు కొత్తగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, నూతనంగా ఏర్పాటు చేసిన విలేజ్ క్లినిక్‌లతో పాటు మొత్తం 40 అంశాలపై మంత్రివర్గ మండలి చర్చించి ఆమోదముద్ర వేయనుంది. అలాగే నూతన పారిశ్రామిక విధానానికి కూడా కేబినేట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో టీడీపీకి గట్టి షాక్, వైసీపీలో చేరిన టీడీపీ మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, వైఎస్‌ జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడి

చర్చకు వచ్చే అంశాలు

1. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఆర్ధిక సాయం అందించే వైఎస్సార్‌ చేయూత పథకం నేడు కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

2. చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు ఇచ్చే విషయమై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.

3. జీఎస్‌టీ ఎగవేతను నివారించడం, మరింత సమర్ధంగా జీఎస్‌టీ వసూళ్ల కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.

4. అక్రమ మద్యం, ఇసుక రవాణా నిరోధించేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

5. పోలీసు శాఖలో 40 అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ పోస్టులను మంజూరు చేయనున్నారు.  నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం, హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు, రెండు వారాల్లోగా ప్రతివాదులందరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు

6. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ ముసాయిదా బిల్లును కేబినెట్‌లో ఆమోదించనున్నారు.

7. జీఎస్‌టీ చట్టంలో సవరణలు, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చట్టంలో సవరణలకు సంబంధించిన ముసాయిదా బిల్లులకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.

8. గండికోట నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

9. రాష్ట్రంలో తెలుగు భాషకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు తెలుగు అకాడమీ ఏర్పాటుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు.

10. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్‌ సిబ్బంది పోస్టుల నియామకంపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది.

11. విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటుతోపాటు రాష్ట్రంలో మూడు కొత్త నర్సింగ్‌ కాలేజీల ఏర్పాటుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు.