Amaravati, Sep 13: ఏపీలో వివాదానికి కేంద్ర బిందువుగా మారిన అంతర్వేది రథం దగ్థం ఘటనలో (Antarvedi Fire Mishap) కరోనా కలకలం రేపుతోంది. రథం దగ్ధమైనందుకు నిరసనగా పలువురు ఆందోళనలో కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు (Police) అరెస్ట్ చేశారు. అయితే వారికి కరోనా టెస్టులు (Corona Tests) నిర్వహించగా వారిలో కొంతమందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. 36 మంది నిందితుల్లో ఇద్దరికి కరోనాగా నిర్ధారణ కాగా.. ముందస్తు జాగ్రత్తగా పోలీసు అధికారులు కూడా పరీక్షలు చేసుకున్నారు.
దీనిలో జిల్లా అదనపు ఎస్పీ( పరిపాలన) కరణం కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ఆయనతో పాటు ఈ కేసును విచారించిన ఎస్పీ నయీమ్ ఆస్మి (Antarvedi investigation officer Tested COVID 19 Positive) రాజోలు సీఐ దుర్గా శేఖర్ రెడ్డి, ఆయన డ్రైవర్, రైటర్, మరో ఐదుగురు ఎస్ఐలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారంతా వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నారు. పలువరు పోలీసు అధికారులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 9,536 కరోనా పాజిటివ్ కేసులు ( new corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 5,67,123కు (Andhra Pradesh Coronavirus) చేరింది. ప్రస్తుతం 95,072 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4,67,139 మంది కోలుకున్నారు. ఒక్క రోజు వ్యవధిలో 66 మంది మరణించారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 4,912కు పెరిగింది. 24 గంటల్లో 10,131 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
గడిచిన 24 గంటల్లో అనంతపురం జిల్లాలో ఏడుగురు, నెల్లూరులో ఏడుగురు, ప్రకాశంలో ఏడుగురు, కడపలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు, గుంటూరులో నలుగురు, విజయనగరంలో నలుగురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
గత కొన్ని రోజులుగా డిశ్చార్జిలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరుగుతున్నాయి. తాజాగా, ఆదివారం 10,131 (COVID-19 Daily Bulletin) మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 5,67,123 పాజిటివ్ కేసులకు గాను, 4,67,139 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 95,072 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.