Amaravati, Nov 19: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా తొలి దశ నుంచి రెండో దశకు (Covid Second Wave) చేరుకుంది. ఇప్పటికే పలు దేశాల్లో సెకండ్ వేవ్ మొదలైంది. ఇక మన దేశ రాజధాని ఢిల్లీలో సెకండ్ వేవ్ దాటి ఏకంగా మూడవదశలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైయస్ జగన్ ( AP CM YS Jagan Mohan Reddy) అధికారులను అప్రమత్తం చేశారు. ఢిల్లీ మరోసారి లాక్‌డౌన్‌కు (Delhi Lockdown) సిద్ధమవుతోందని తెలిపిన సీఎం రాష్ట్రంలో మనం జాగ్రత్తగా చాలా ఉండాలని సూచించారు.
స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు ఎస్‌పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్–19 నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ సెకండ్ వేవ్‌తో యూరప్ మొత్తం వణుకుతోంది. ఫ్రాన్స్, లండన్‌లో షట్‌డౌన్ విధించారు. అమెరికా కూడా తీవ్ర ఇబ్బంది పడుతోంది. అక్కడ మొదలు కాగానే ఇక్కడా వస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నాం కాబట్టి కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి. ప్రస్తుతానికి కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గినా, సెకండ్ వేవ్ వస్తుంది కాబట్టి కలెక్టర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. రాష్ట్రంలో ఇప్పుడు రోజూ దాదాపు 75 వేల పరీక్షలు చేస్తున్నాం. కొన్నిరోజుల క్రితమే 90 లక్షల మార్కును దాటేశాం. ప్రతి 10 లక్షల మంది జనాభాకు 1.7 లక్షలకు పైగా పరీక్షలు చేస్తున్నాం. పాజిటివిటీ రేటు తగ్గింది. కోవిడ్ నివారణకు చేసిన కృషికి కలెక్టర్లకు అభినందనలు అని తెలిపారు. 104 నంబర్‌ను సింగిల్ పాయింట్ కాంటాక్ట్‌గా అభివృద్ధి చేయాలి. ఈ నంబర్‌పై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలి. ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే 30 నిమిషాల్లో బెడ్ కేటాయించాలని ఏపీ సీఎం అన్నారు.
Here's AP Covid Report
#COVIDUpdates: 18/11/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,54,500 పాజిటివ్ కేసు లకు గాను
*8,31,085 మంది డిశ్చార్జ్ కాగా
*6,899 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 16,516#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Fuc2LD6WNB
— ArogyaAndhra (@ArogyaAndhra) November 18, 2020
ఏపీలో కొత్తగా 1236 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 69,618 శాంపిల్స్‌ను పరీక్షించగా వీటిలో 1236 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో ఒక్కరోజులో 9 మంది మృతిచెందారు. జిల్లాల వారీగా కొవిడ్ మరణాలు ఈ విధంగా ఉన్నాయి. చిత్తూరు, కృష్ణ, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పున, అనంతపూరం, తూర్పుగోదావరి,గుంటూరులో ఒక్కో వ్యక్తి చొప్పున మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో 1696 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 93,33,703 శాంపిల్స్ ని పరీక్షించారు. యాక్టివ్ గా 16,516 కేసులు ఉండగా 833980 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 6899 మంది మరణించారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 857395గా ఉంది.