Amaravati, June 12: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 11,775 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 141 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ (AP Coronavirus) జరిగింది. కరోనాతో కోలుకొని 59 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్ (Health Department) విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,402 కేసులు (COVID 19 Cases) నమోదవ్వగా, 80 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. మొత్తం 2,599 మంది వైరస్ నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రలో ప్రస్తుతం 1723 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పేషెంట్లను జంతువులు కన్నా హీనంగా చూస్తారా, ఢిల్లీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు సీరియస్, కుళ్లిన మృతదేహాల వీడియో ఫేక్ అంటూ కొట్టి పారేసిన పశ్చిమ బెంగాల్ వైద్యారోగ్య శాఖ అధికారులు
తిరుమల గోవిందరాజ స్వామి ఆలయంలో విధులు నిర్వహించే శానిటరీ ఇన్ స్పెక్టర్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో రెండు రోజుల పాటు స్వామి దర్శనాలను నిలిపి వేశారు. భక్తుల సందర్శనను కట్టడి చేసి ఆలయంలో శానిటైజేషన్ ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో రెండు రోజులపాటు గోవిందరాజ స్వామి ఆలయంలో దర్శనాలన్నింటినీ నిలిపివేశారు. ఉద్యోగికి కరోనా రావడంతో ఆలయంలో పూర్తి గా శానిటేషన్ ప్రక్రియను నిర్వహించారు. టీటీడీ శానిటరీ ఇన్స్పెక్టర్‌కు కరోనా పాజిటివ్ రావడం విశేషం. కరోనా కేసుల్లో బ్రిటన్‌ను దాటి 4వ స్థానానికి వచ్చిన భారత్, గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 10956 కేసులు నమోదు, మొత్తం 8,498 మంది మృతి
పశ్చిమగోదావరి జిల్లాలో భార్యకు కరోనా వైరస్ సోకడంతో మనోవేదనకు గురై భర్త మృతి చెందిన ఘటన ఏలూరు నగరంలో జరిగింది. ఏలూరు టూటౌన్‌లో నివాసముండే వివాహితకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. ప్రైమరీ కాంటాక్ట్‌గా భర్తను కూడా కార్వంటైన్‌కు తరలిస్తున్న సమయంలో బస్సు ఎక్కుతూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించగా, నెగిటివ్ రిపోర్టు వచ్చింది. భార్యకు కరోనా రావడంతో బాధతో మృతి చెందినట్లు వైద్యులు భావిస్తున్నారు. స్థానికులను ఈ విషాద ఘటన కలిచివేసింది.