Amaravati, Nov 20: నెల్లూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాలకు వరదలు సంభవించడంతో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని దామరమడుగు వద్ద తండ్రీకొడుకులను రక్షించిన శ్రీనివాసరావు అనే ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్, ఆపై ప్రమాదవశాత్తు మృతి (sdrf constable srinivasarao died) చెందారు.
వరదలో చిక్కుకున్న (Rescue operation nellore district) తండ్రీకొడుకులను కాపాడిన శ్రీనివాసరావు తాను నీటిలో మునిగిపోయారు.ఆయన లైఫ్ జాకెట్ జారిపోవడంతో వరద ఉద్ధృతికి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. తమ ప్రాణాలను కాపాడిన ఆ కానిస్టేబుల్ తన ప్రాణాన్ని కోల్పోవడం ఆ తండ్రీకొడుకులను కలచివేసింది. వారు కన్నీటిపర్యంతమయ్యారు.
విషాద ఘటన వివరాల్లోకెళితే.. నెల్లూరు జిల్లాలో వర్షాలు, వరద బాధిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్వయంగా రంగంలోకి దిగి అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో బుచ్చి మండలం దామరమడుగు గ్రామం వద్ద వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. కానిస్టేబుల్ శ్రీనివాసరావు లైఫ్ జాకెట్ ధరించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాడు.
ఇదే క్రమంలో తండ్రీ కొడుకులను తరలిస్తుండగా.. తన లైఫ్ జాకెట్ ఊడిపోయింది. తండ్రీకొడుకులను ఒడ్డుకు చేర్చిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు తాను మాత్రం బయటపడలేక నీటి ఉధృతిలో కొట్టుకుపోయాడు. సహచర బృందం వారు గుర్తించి స్పందించి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు వరదలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం విషాదం రేపింది. చనిపోయిన కానిస్టేబుల్ విజయరావు విజయనగరం జిల్లా ఐదవ బెటాలియన్ లో పనిచేస్తున్నాడు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ విజయరావు, ఇతర పోలీసు అధికారులు కానిస్టేబుల్ శ్రీనివాసరావు భౌతిక కాయానికి నివాళులర్పించి సంతాపం తెలియజేశారు.
Andhra Pradesh Police Tweet
#APPolice constable sacrifices his life in the service of people:
Kella Srinivasa Rao, PC 5th Bn #SDRF of #Vizianagaram drowned&succumbed today at 8.30 am at Damaramadugu(V), Buchhireddy Palem(M), #Nellore District in a rescue operation to save the villagers stranded in floods. pic.twitter.com/n17wlBsENE
— Andhra Pradesh Police (@APPOLICE100) November 20, 2021
DGP Gautam Sawang, IPS expressed grief & extended heartfelt sympathies to the bereaved family and said APPolice will support the family always and remembers his supreme sacrifice while discharging duties in the sevice of public.
— Andhra Pradesh Police (@APPOLICE100) November 20, 2021
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వరద తీవ్ర నష్టం కలిగించింది. మొత్తం 18 మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. 50 మందికి పైగా ప్రజలు గల్లంతయ్యారని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తెలిపారు.