Amaravati, May 9: ఏపీలో గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 92 మంది కరోనాతో (Covid Deaths) మరణించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12 మంది, విజయనగరం జిల్లాలో 11 మంది, విశాఖ జిల్లాలో 10 మంది మృతి చెందారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు నమోదయ్యాయి. దాంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 8,707కి (AP Coronavirus Deaths) పెరిగింది.
ఇక తాజాగా రాష్ట్రంలో 1,05,494 కరోనా పరీక్షలు నిర్వహించగా 22,164 మందికి పాజిటివ్ (Covid Positive Cases) అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 2,844 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 18,832 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 12,87,603 పాజిటివ్ కేసులు నమోదు కాగా 10,88,264 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,90,632 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో నేటి వరకు 1,73,67,935 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. రెమ్‌డెసివర్‌పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, హెల్ప్‌లైన్ ద్వారా బాధితులకు అండగా ఉంటున్నామని చెప్పారు.
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అడ్మిషన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్రంలో 637 హాస్పిటల్స్‌లో కోవిడ్ చికిత్స అందిస్తున్నాం.13,461 ప్రవేట్ హాస్పిటల్స్‌లో రేమ్‌డేసివర్ అందుబాటులో ఉన్నాయి. 104 కాల్ సెంటర్‌కు 16, 905 కాల్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 2 లక్షలు 8 వేల మంది కాల్స్ చేశారు. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించుకున్నాం.
Here's AP Covid Report
#COVIDUpdates: As on 09th May 2021 10:00 AM
COVID Positives: 12,84,708
Discharged: 10,85,369
Deceased: 8,707
Active Cases: 1,90,632#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/mcwr820zSO
— ArogyaAndhra (@ArogyaAndhra) May 9, 2021
కోవిన్ యాప్‌లో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరాం.. అంగీకరించింది. కోవిడ్ సమయంలో పనిచేసిన వారికి రెగ్యులర్ రిక్రూట్ మెంట్లో ప్రాధాన్యత కల్పిస్తూ జీవో జారీ చేశాం. 15% వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించాం. చాలా చోట్ల మొదటి వ్యాక్సినేషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. జనం ఎక్కువగా ఒకే చోట గుమికూడకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు.