penumatsa-suresh-babu-files-nomination-mlc-candidate (Photo-Twitter)

Amaravati, August 13: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేష్‌ బాబు (Penmatsa Suresh Babu) గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana), ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి విజయనగరానికి చెందిన దివంగత నేత పెన్మత్స సాంబశివరాజు తనయుడు సురేష్‌ బాబు పేరును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) ఖరారు చేశారు. ఇప్పటికే ఈ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అయింది. నామినేషన్‌ దాఖలుకు ఈ నెల 13వ తేదీ ఆఖరుకావడంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు.

Here's AP CMO Tweet

ఈ నెల 24న ఈ ఎన్నిక (AP MLC Elections) జరగనుంది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఈ స్థానం సంఖ్యాపరంగా వైఎస్సార్‌సీపీకే దక్కే అవకాశం ఉంది. టీడీపీ బరిలో నిలిచే అవకాశం కూడా పెద్దగా లేనందున సురేష్‌ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. అమరావతిలో నిర్మాణాలపై ఏపీ సీఎం రివ్యూ, ప్రారంభానికి సిద్ధమైన కనకదుర్గ ఫ్లైఓవర్‌, 15వ తేదీ సాయంత్రం వరకు విజయవాడలో పలు ఆంక్షలు

ఈ సందర్భంగా పెన్మత్స సురేష్‌ బాబు మాట్లాడుతూ అందరినీ కలుపుకుని పార్టీకి మంచిపేరు తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్టీకి విధేయుడిగా ఉంటానని, చెడ్డపేరు తీసుకురానని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... పెన్మత్స సాంబశివరాజు (Penumatsa Sambasiva Raju) వారసుడుగా సురేష్‌ బాబు పార్టీకి విధేయుడుగా ఉన్నారన్నారు. వైసీపీలో పండగ వాతావరణం, కొత్తగా ఇద్దరు మంత్రులతో పాటు రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం, సీఎం పరిధిలో రెండు శాఖలు, గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలు

పెనుమత్స సాంబశివరాజు అనారోగ్యంతో కన్నుమూత

మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు అనారోగ్యంతో కన్నుమూసిన (Penumatsa Sambasiva Raju Dies) సంగతి విదితమే. విశాఖ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడిగా ఆయన గుర్తింపును సొంతం చేసుకున్నారు. 1989-94 లో మంత్రిగా, 1958లో సమితి ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఆయన గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1967 నుంచి 2004 వరకు వరుసగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో 1994 మినహా ఆయన 8సార్లు గెలుపొందారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడిగా గుర్తింపు పొందారు.

AP CMO Tweet

తితిదే పాలకమండలి సభ్యుడిగానూ పనిచేశారు. ప్రొటెం స్పీకర్‌గా రెండు సార్లు వ్యవహరించారు. ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు పలువురు నేతలకు పెనుమత్స రాజకీయ గురువు. వైకాపా కేంద్ర పాలకమండలి సభ్యుడిగా చనిపోయేవరకు కొనసాగారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు పెనుమత్స సాంబశివరాజు’ అని సీఎం జగన్‌ కొనియాడారు. ఐదు దశాబ్దాలకుపైగా ప్రజాసేవలో ఉంటూ మచ్చలేని నాయకుడిగా పేరు పొందారని వివరించారు. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు సంతాపం తెలిపారు.