NimmaGadda Ramesh kumar: తన ఓటు హక్కు అడగడం వల్లే ఈ గొడవంతా, ప్రభుత్వం-ఎస్ఈసీ మధ్య వివాదం టీ కప్పులో తుఫాన్‌ వంటిది, ప్రభుత్వ తోడ్పాటుతోనే స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాం, మీడియాతో నిమ్మగడ్డ రమేష్ కుమార్
Nimmagadda Ramesh kumar vs AP CM YS Jagan (Photo-File Image)

Amaravati, Mar 31: ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం నేటితో ముగియనుండటంతో ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం-ఎస్ఈసీ మధ్య వివాదం టీ కప్పులో తుపానులా సమసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ( AP SEC Nimmagadda Ramesh Kumar) అభిప్రాయపడ్డారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని, ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) అన్నారు.

ఎన్నికల నిర్వహణ పట్ల తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానన్నారు. రీపోల్ లేకుండా ఎన్నికలు నిర్వహించడం చాలా అరుదుగా జరుగుతుందన్నారు. స్థానిక ఎన్నికల్లా కాకుండా సాధారణ ఎన్నికల స్థాయిలో ఈ ఎన్నికలు నిర్వహించామన్నారు. ఇవన్నీ ప్రభుత్వం, సీఎస్ నుంచి పూర్తి సహకారం లభించిందని, మీడియా ద్వారా సిఎస్‌కు, సహచర ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానన్నారు. వ్యవస్థల మధ్య అంతరాలు అనవసరంగా వచ్చాయని, ఎన్నికల సిబ్బందిని సెలవుల్లో వెల్లమన్నారని.. దీన్ని వెంటనే చక్కదిద్దామన్నారు.

వ్యక్తుల అనాలోచిత చర్యలతో వ్యవస్థకు చేటు అని ఆయన అభిప్రాయపడ్డారు. సరైన సమయంలో స్పందించకపోతే అగాధాలకు దారి తీస్తోందన్నారు. పదవిలో ఉన్నంత కాలం ఎలాంటి వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లలేదన్నారు

నేటితో ముగియనున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ పదవీ కాలం, దొరకని గవర్నర్ అపాయింట్‌మెంట్, కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని రేపు బాధ్యతలు, ఎస్‌ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను మూసేసిన హైకోర్టు

తన ఓటు తెలంగాణలో రద్దు చేసుకుని సొంత గ్రామంలో ఓటు అడిగానని, అది నిరాకరించడంవల్ల టీ కప్పులో తుఫానుగా మారిందన్నారు. ఇప్పటికీ తన ఓటు హక్కు కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ఓటు హక్కు కోసం అవసరమైతే హైకోర్టుకు వెళతానన్నారు. ఏపీ హైకోర్టు పంచాయతీ ఎన్నికల్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిందని నిమ్మగడ్డ అన్నారు. ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ అని, 243కె ద్వారా విస్తృత అధికారాలు రాజ్యాంగం కల్పించిందన్నారు.

ఎన్నికల కమిషన్ ఇతర వ్యవస్థలలో జోక్యం చేసుకోకూడదని, వాటికి గౌరవం ఇవ్వాలన్నారు. వ్యవస్థలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. నామినేషన్ వెయ్యనివ్వలేనప్పుడు మరో అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నం చేశామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు మీడియా అందించిన సహకారానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

కోవిడ్‌ వల్ల ఆదాయం లేదు, అనవసర ఖర్చులు తగ్గించండి, ఓటాన్‌ అకౌంట్‌ కేటాయింపుల పనులకే బిల్లులు ఇవ్వండి, ఉత్తర్వులు జారీ చేసిన ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌

ఏపీ ఎస్ఈసీ గా తన తర్వాత నీలం సహానీ బాధ్యతలు చేపట్టడాన్ని ఆయన స్వాగతించారు. ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలపై నీలం సహనీకి తాను లేఖ రాసినట్టుగా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.తాను ఎవరికి ఏమి లేఖలు రాసినా వాటిని బయటకు చెప్పలేనన్నారు.

గవర్నర్ అపాయింట్ మెంట్ తనకు లభించలేదని వచ్చిన వార్తలపై స్పందించిన ఆయన, ఇటీవల టీకాను తీసుకున్న గవర్నర్, కొన్ని వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లాల్సి వున్న కారణంగా,మంగళ, బుధ వారాల్లో ఎవరినీ కలవబోవడం లేదని తనకు సమాచారం అందిందని అన్నారు. త్వరలోనే గవర్నర్ ను కలిసి తాను పదవిలో ఉన్న సమయంలో తయారు చేసిన రిపోర్టును అందిస్తానని స్పష్టం చేశారు.