AP Shocker: ప్రియుడితో రాసలీలల్లో తల్లి, ఈ పాడుపనిని మందలించిన కూతురు, కోపంతో కుమార్తెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన తల్లి ఆమె ప్రియుడు, కడపలో నిందితులు అరెస్ట్
Arrested (Photo Credits: Pixabay/ Representational Image)

YSR Kadapa, Feb 28: కడప జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన వివాహేతర సంబంధం గురించి మందలించిందన్న కోపంతో ప్రియుడితో కలిసి సొంత కూతురినే (Mother kills daughter) ఓ తల్లి అంతమొందించింది. గత ఏడాది అక్టోబర్‌ 16న జరిగిన ఈ ఘటన అప్పట్లో ఆత్మహత్యగా చిత్రీకరించినప్పటికీ పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ జరిపి హత్య అని తేల్చారు. ఆదివారం ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.బద్వేలు మండల పరిధి లోని లక్ష్మీపాలెం గ్రామానికి చెందిన గానుగపెంట వెంకటయ్య, రమణమ్మల కుమార్తె వెంకటసుజాత. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం వరకు చదివింది. రమణమ్మ తమ గ్రామానికి చెందిన గానుగపెంట శ్రీను అలియాస్‌ శీనయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం (extramarital affair in YSR Kadapa district) పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన కూతురు వెంకటసుజాత తల్లిని మందలించింది.

లాడ్జిలో మైనర్ బాలికపై తెగబడిన టీఆర్ఎస్ నేత, బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసిన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ షాజిద్ ఖాన్, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

దీంతో రమణమ్మ కుమార్తెను అంతమొందించాలని నిర్ణయించుకుంది. ప్రియుడు శ్రీను, సమీప బంధువైన ఆటోడ్రైవర్‌ మేకల మల్లెంకొండయ్యతో కలిసి పథకం పన్నింది. అందరూ కలిసి గత ఏడాది అక్టోబర్‌ 16వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రపోతున్న వెంకట సుజాత గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. తర్వాత మల్లెంకొండయ్యకు చెందిన ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడేసి వచ్చారు. తర్వాత సుజాత కనిపించడం లేదని, తండ్రి తాగుడుకు బానిస కావడంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అందరిని నమ్మించారు.

మాయమాటలతో మహిళను లోబర్చుకున్న కానిస్టేబుల్, తాను చెప్పినట్లు వినకపోతే కష్టాలు తప్పవని బెదిరింపులు, పెళ్లి చేసుకోమంటే తీవ్రంగా కొట్టిన వైనం

పోలీసులకు కూడా అదే ప్రకారం ఫిర్యాదు చేశారు. రెండు రోజుల తర్వాత గ్రామ శివారులోని బావిలో సుజాత మృతదేహం లభ్యమైంది. అయితే తండ్రి ప్రవర్తన నచ్చక వెంకటసుజాత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. అటు తర్వాత కేసును పకడ్బందీగా విచారించి మిస్టరీని ఛేదించారు. కేసు విచారణలో చురుగ్గా వ్యవహరించిన అర్బన్‌ సీఐ రామచంద్ర, ఎస్‌ఐ వెంకటరమణలను జిల్లా ఎస్పీ అన్బురాజన్, మైదుకూరు డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌లు అభినందించారు.